Crime Thriller OTT : ఈ మధ్య కాలంలో యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ మూవీలకు డిమాండ్ ఎక్కువ.. ఇలాంటి సినిమాలకే ప్రజలు ఓటు వేస్తున్నారు. థియేటర్లలో యాక్షన్ సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు. కానీ ఓటీటీలో మాత్రం సినిమాలు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇటీవల ఓటీటీ సంస్థలు ఎక్కువగా కొత్త కంటెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ఓటీటీ సంస్థలు కొత్త ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక తాజాగా ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ఆ సినిమా ఏంటో? ఎప్పుడూ స్ట్రీమింగ్ కు వచ్చిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తాజాగా ‘సెక్టార్ 36’ కూడా ఆ లిస్టులో చేరేలా కనిపిస్తోంది. డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాసే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఓటీటీలో దూసుకెళుతోంది.. డైరెక్ట్ గా ఓటీటీలోకే రావడంతో విక్రాంత్ ( Vikranth ) ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సెక్టార్ 36 ( Sector 36 ) సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ శుక్రవారం సెప్టెంబర్ 13 స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే అడుగుపెట్టింది. హిందీతో పాటు తెలుగు, ఇంగ్లిష్, తమిళం భాషల్లోనూ నెట్‍ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చింది.. ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు చూసేద్దాం..
ఈ మూవీకి ఆదిత్య నిబంల్కర్ (Aditya Nibamlkar ) దర్శకత్వం వహించారు. నిథారీ కిల్లింగ్ పేరుతో పాపులర్ అయిన 2006 నోయిడా వరుస హత్యల ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. థ్రిల్లింగ్ కథనంతో ఈ చిత్రాన్ని ఆదిత్య ముందుకు నడిపారు. ఒక్కో సీన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. క్రైమ్ కథ అందులో కొత్తగా ఉండటంతో జనాలు ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే.. విక్రాంత్ మాసే, దీపక్ దోబ్రియల్ సహా ఈ మూవీలో నటించిన అందరి పర్ఫార్మెన్స్ మెప్పించిందని పోస్టులు చేస్తున్నారు. ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారంటూ డైరెక్టర్ ఆదిత్యను పొగడ్తలతో ముంచేస్తున్నారు.. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు సెక్టార్ 36 మూవీని మిస్ కావొద్దని చాలా మంది సూచిస్తున్నారు. ఈ సినిమాలో కథనం, థ్రిల్లింగ్ అంశాలు ఎంగేజింగ్‍గా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. మొత్తాని కి సినిమా అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని తెలుస్తుంది. నోయిడాలోని సెక్టార్ 36లో పిల్లలను హత్య చేసిన ఓ సైకోకిల్లర్ చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. హత్య చేసిన కేసుల్లో నిందితుడు, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఆకట్టుకున్నాయి.. మొత్తానికి ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక గతంలో ఈయన నుంచి 12 ఫెయిల్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్నట్లే తెలుస్తుంది.. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాల తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఆ సినిమాలతో ఎలాంటి కథతో వస్తాడో చూడాలి..