OTT Bold Movie : ఈ మధ్య కాలంలో ఎక్కువగా హారర్ అండ్ బోల్డ్ కంటెంట్ సినిమాలను చూస్తున్నాం.. కొన్ని సినిమాలు కాన్సెఫ్ట్ బాగా ఉండటంతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని సినిమాలు విమర్శలు అందుకుంటున్నాయి. తాజాగా ఓ సూపర్ హిట్ బోల్డ్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈరోజు అర్థ రాత్రి నుంచే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. ఏ సినిమా అనుకుంటున్నారు కదూ.. ఆ సినిమా పేరు బ్యాడ్ న్యూజ్ ( Bad Newz) .. ఈ మూవీ స్టోరీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి…
గత ఏడాది రిలీజ్ అయిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ యానిమల్.. ఈ మూవీతో బోల్డ్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న త్రిప్తి దిమ్రి ( Tripthi Dimri ) ఆ తర్వాత వరుస బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. తాజాగా ఈమె నటించిన బ్యాడ్ న్యూస్. ఈ బోల్డ్ మూవీలో తన బిడ్డకు ఇద్దరు తండ్రులంటూ చాలా బోల్డ్ పాత్రలో నటించింది.. జూలై 19 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఫ్రీగా సబ్‌స్క్రైబర్లందరూ చూసేయొచ్చు. స్ట్రీమింగ్ ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక్కసారి చూసేద్దాం..
విక్కీ కౌశల్( Vicky Koushal ) , తృప్తి డిమ్రి ( Tripthi Dimri ) , ఆమీ విర్క్ (Amy Virk ) నటించిన మూవీ బ్యాడ్ న్యూస్. జులై 19న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 13) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. అమౌంట్ పే చేసి చూడాలని అనుకొనేవారికి ముందే ఓటీటీ లోకి వచ్చింది. ఈ ఏడాది రిలీజైన హిందీ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఏడో మూవీగా నిలిచింది. రూ.80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.115.74 కోట్లు వసూలు చేసింది.
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఒకే తల్లికి ఇద్దరు తండ్రుల ద్వారా కవలలు ఎలా పుడతారన్న కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీకి థియేటర్ల లో మంచి రెస్పాన్స్ వచ్చింది. చెఫ్ పాత్రలో ఈమె కనిపించింది. బాయ్‌ఫ్రెండ్ తో శారీరక సంబంధం కారణంగా అనూహ్యంగా కవలలను తన కడుపులో మోస్తుంది. సాధారణంగా గర్భం దాల్చడం గుడ్ న్యూసే అయినా.. ఆ బిడ్డకు ఇద్దరు తండ్రులన్న భిన్నమైన కాన్సెప్ట్ తో సినిమా స్టోరీ ఉండటం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందులో త్రిప్తి అందాలు హైలెట్ అయ్యాయి. ఈమె కోసం యూత్ వెయిట్ చేస్తుంటారు. ఈ సినిమాలో కూడా ఓ రేంజులో అందాలను వలకబోసింది.. అక్కడ మంచి టాక్ ను అందుకున్న సినిమా ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..