Horror Movie OTT : ఓటీటీలో హార్రర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్లలో ఒక్కసారే చూసే సినిమాలను ఇక్కడ మళ్లీ మళ్లీ చూడొచ్చు.. అందుకే మూవీ లవర్స్ ఎక్కువగా ఇక్కడ సినిమాలను వీక్షిస్తున్నారు. ఓటీటీలో ప్రతి వారం కొత్త సినిమాలు విడుదల అవుతూ సందడి చేస్తున్నాయి. థియేటర్స్ లో ఎప్పటికైనా అద్భుతమైన అనుభూతి కలిగించే సినిమాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి హారర్ జానర్ సినిమాలే. మనకి తెలిసినవి రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma) తెరకెక్కించిన సినిమాలు మాత్రమే.. వీటికన్నా భయంకరమైన సినిమాలు చాలానే ఉన్నాయి. ఓటీటీ లోకి తాజాగా గుండెల్లో వణుకు పుట్టించే సస్పెన్స్, హారర్ మూవీ వచ్చేసింది. ఆ సినిమా ఏంటో? స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందో ఒకసారి చూసేద్దాం..
గతంలో ఓటీటీ లో విడుదలైన ఒక హాలీవుడ్ హారర్ చిత్రాన్ని చూసి విదేశాల్లో ఒక జంట గుండె ఆగి చనిపోయారు అని చెప్తే మీరు నమ్మగలరా?, కానీ నమ్మాలి, ఎందుకంటే అది నిజం కాబట్టి. నెట్ ఫ్లిక్స్ లో కొంతకాలం క్రితమే ‘స్మైల్’ ( Smile) అనే హారర్ సినిమాని అప్లోడ్ చేసారు. ఇది థియేటర్స్ లో విడుదలైంది 2022 వ సంవత్సరం లో, కానీ నెట్ ఫ్లిక్స్ లో ఆలస్యంగా విడుదల చేసారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ మూవీ పోస్టర్స్ ఆడియన్స్ ను ఆలోచింపజేస్తున్నాయి. నవ్వు ముఖం మనల్ని అలా వెంటాడుతూనే ఉంటుంది. సినిమాలో అలాంటి భయంకరమైన నవ్వు మనల్ని వణికించేలా చేస్తుంది. అనేక సన్నివేశాలకు మనం సీట్స్ నుండి ఉలిక్కిపడి లేచి కూర్చుకుంటాము.. ఇక అర్ధ రాత్రి ఒంటరిగా చూస్తే గుండె ఆగిపోతుంది.
ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. పాత సినిమాలను ఓటీటీలోకి ఎలా తీసుకొని వచ్చారో ఈ సినిమాను మళ్లీ నెట్ఫ్లిక్స్ లోకి తీసుకొచ్చారు. గతంలో వచ్చిన సినిమాలు ఇంతగా భయపెట్టలేదు. కానీ ఈ సినిమాను చూస్తే మాత్రం భయంతో వణికిపోవడం కామన్.. కచ్చితంగా ఒక అద్భుతమైన హారర్ అనుభూతి కలగాలి, మమల్ని భయపెట్టే హారర్ చిత్రం వచ్చి చాలా కాలం అయ్యింది అని అనుకునేవాళ్లు మాత్రం ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ అవ్వకండి. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది, తెలుగు ఆడియో లేదు, కేవలం ఇంగ్లీష్ ఆడియో మాత్రమే ఉంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ వస్తున్నాయి. మీకు ఆ థ్రిల్ కావాలంటే మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చెయ్యండి… ఈ మధ్య ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్స్ ఎక్కువగా హారర్ , థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను ఓటిటిలోకి తీసుకొస్తున్నారు. థియేటర్లలో సక్సెస్ అవ్వకున్న ఇక్కడ మంచి టాక్ ను అందుకుంటున్నాయి . ఇప్పుడు మరోసారి స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని చూసి కాసేపు థ్రిల్ ఫీల్ అవ్వండి.