Thangalaan OTT.. ప్రముఖ కోలీవుడ్ హీరో విక్రమ్ చియాన్ (Vikram chiyan) తాజాగా నటించిన చిత్రం తంగలాన్. కబాలి, సర్పత్త పరంబరై, కాలా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి, భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ప్రముఖ డైరెక్టర్ పా. రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతకుమించి విజయాన్ని దక్కించుకుంది. ఇక ఇందులో విక్రమ్ తో పాటు పార్వతీ తిరువొత్తు, మాళవిక మోహనన్ తదితర స్టార్ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు.
రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్.
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా మొదటి షో మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడంతో కలెక్షన్లు కూడా బాగా వచ్చాయి. దాదాపు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ ఒక తమిళ్లోనే ఈ సినిమా రాబట్టింది. అంతేకాదు విక్రమ్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేస్తున్న చిత్రంగా ఈ సినిమా నిలవబోతోంది. ఒక తమిళ్లోనే కాదు తెలుగులో కూడా మంచి వసూలు లభించాయి.
తంగలాన్ ఓటీటీ డేట్ ఫిక్స్..
అటు సత్ ఇండియాలో మంచి విజయం అందుకోవడంతో బాలీవుడ్ లో కూడా సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్లలో ఈ సినిమా ఆడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఓటీటీ కి సిద్ధమైందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ దక్కించుకోగా.. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. విక్రం మీద ఉన్న గౌరవం, సినిమా పై ఉన్న నమ్మకం కారణంగా విడుదలకు ముందే కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు కొనుగోలు చేసింది నెట్ఫ్లిక్స్. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 20 వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి నెట్ఫ్లిక్స్ కూడా ప్రకటించినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఇకపోతే నెట్ ఫ్లిక్స్ నుంచీ అధికారికంగా , సోషల్ మీడియా ఖాతాలో తంగలాన్ ఓటీటీన్ గురించి ఎక్కడ ఎటువంటి సమాచారం లేదు. కానీ ఈ సినిమా 20వ తేదీ నుంచి ఓటీటీ లోకి వస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
హిందీ లో మాత్రం సెప్టెంబర్ 27 నుండి తంగలాన్ స్ట్రీమింగ్..
అదే రోజు తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక హిందీలో మాత్రం సెప్టెంబర్ 27న విక్రమ్ సినిమా అందుబాటులోకి రాబోతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కే ఈ జ్ఞాన వేలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చగా, 1850 ప్రాంతంలో జరిగే కథాంశం తో, ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గిరిజనులను ఉపయోగించుకొని బ్రిటిష్ వారు బంగారాన్ని ఎలా దోచుకున్నారు? అనే పాయింట్ తో.. అప్పటి కులతత్వం, వర్ణ వ్యవస్థ, గిరిజనుల విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, బ్రిటిష్ వారి దురాగతాలను అంతర్లీనంగా చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ రంజిత్ ఇక ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ఇప్పటికే థియేటర్లలో మంచి వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఎటువంటి టిఆర్పి రేటింగ్ అందుకుంటుందో చూడాలి.