Horror Mystery OTT: ఈ మధ్య ఓటీటీలోకి హారర్ ఎలిమెంట్స్ ఉన్న కంటెంట్ సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి. భయానకమైన కథలతో వచ్చే సినిమాలకు ఓటీటీలో ఆదరణ ఎక్కువగానే ఉంటుంది. కొత్త సినిమాలే కాదు పాత సినిమాలు కూడా ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. హారర్ కంటెంట్ సినిమాలకు డిమాండ్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక విషయానికొస్తే నాలుగేళ్ల తర్వాత ఓ హారర్ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది. ఈ హాలీవుడ్ హారర్ మిస్టరీ మూవీ పేరు ది రెంటల్ (The Rental ). ఈ సినిమా 2020లో రిలీజై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తుంది. ఆ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఎప్పుడో కనుమరుగయిన సినిమాలను ఇప్పుడు కొత్తగా బయటకు ఓటీటీ సంస్థలు తీస్తున్నాయి. అందుకే ఆ సినిమాలు మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలకు కేరాఫ్ గా లయన్స్‌గేట్ ప్లే (Lions Gateplay) ఓటీటీ సంస్థ ముందుంటుంది. ఇప్పుడు ఈ సినిమా ఇక్కడ శుక్రవారం స్ట్రీమింగ్ కాబోతుందని ప్రకటించారు.. ఈ హారర్ మిస్టరీ మూవీ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. జెరెమీ అలెన్ వైట్, అలీసన్ బ్రీ, డాన్ స్టీవెన్స్, షీలా వాండ్, ఆంథోనీ మొలినరీ నటించారు..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఈ హారర్ మూవీ మొత్తం రెండు జంటల మధ్య తిరుగుతుంది. అదే సినిమాకు ప్లస్ అయ్యింది. జనాలకు ఉత్కంటను కలిగించింది. తమ బిజీ జీవితాల నుంచి కాస్త ఉపశమనం పొందడానికి వీళ్లు అందరికీ దూరంగా ఓ కొండపై ఓ ఇంటిని అద్దెకు తీసుకుంటారు. అయితే తమ బిజీ జీవితాల నుంచి తప్పించుకోవడానికి అక్కడికి వెళ్లిన వాళ్లకు ఊహించని ఘటనలు ఎదురవుతాయి. వాటిని నుంచి బయట పడేందుకు ఆ జంటలు ఏం చేస్తారు అన్నది సినిమా కథ..
జంటలకు ఆ వెకేషన్ కాస్తా ఓ పీడకలగా మారిపోతుంది. దాన్నుంచి వాళ్లు తప్పించుకుంటారా లేదా? చివరికి ఏం జరుగుతుంది అన్నది మూవీలో చూడొచ్చు. డేవ్ ఫ్రాంకో డైరెక్ట్ చేసిన ఈ సినిమా నాలుగేళ్ల కిందట కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే రిలీజైంది.. బాగా హారర్ ఇష్ట పడేవారికి ఈ మూవీ నచ్చుతుందని తెలుస్తుంది. ఇక అదే విధంగా మరో హారర్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. టారట్ ( Tarot ) అనే హారర్ మూవీ.. నాలుగు నెలల తర్వాత తెలుగు, తమిళం భాషల్లోనూ రావడం విశేషం. ఇప్పటికే ఇంగ్లిష్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అంటే ఇది నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.. ఆసక్తి కలిగిన వాళ్లు ఇక్కడ చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.. ఇలాంటి భయంకరమైన సినిమాలకు ఓటిటిలో మంచి స్పందన వస్తుంది. మరి సినిమా ఎలా ఉండబోతున్నాయి చూడాలి . ఏది ఏమైనా ఈ సినిమాలు ఆకట్టుకోవడమే కాదు మంచి వ్యూస్ ను రాబడుతాయని తెలుస్తుంది.