Shobhitha Dulipala OTT : అక్కినేని కొత్త కోడలు శోభిత దూలిపాళ్ళ గురించి ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తెలుగులో ఈ అమ్మడు సినిమాలు తియ్యక పోయిన నాగ చైతన్య ( Naga Chaithanya) తో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఈమె గురించి ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు. ఈ అమ్మడు చేసిన సినిమాల నుంచి యాడ్స్ వరకు అన్నిటిని గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. అందుకే గూగుల్ లో టాప్ సెర్చ్ లో ఈ అమ్మడు పేరు ఉంటుంది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికి వైరల్ అవుతున్నాయి. అయితే పెళ్లికి ఇంకా సమయం ఉండటంతో వీరిద్దరు సినిమాల పై ఫోకస్ పెట్టారు. తాజాగా శోభిత నటిస్తున్న బోల్డ్ మూవీ ఓటీటీ లోకి రాబోతుంది. ఆ మూవీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
శోబితా ఇప్పటివరకు బాలీవుడ్ వరుస సినిమాల ను చేస్తుంది. అలాగే వెబ్ సిరీస్ లను కూడా చేస్తుంది. ఆ సినిమాలు అన్నీ కూడా బాగా బోల్డ్ గా ఉన్నాయని తెలుస్తుంది. ఇక శోభిత ధూళిపాళ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తారనే పేరుంది. ఇక ఆమె నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా మూవీ ‘లవ్ సితార’ ( Love Sitara ) నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాలో రాజీవ్ సిద్ధార్థ్ ( Rajeev Siddarth ) లీడ్ రోల్‌లో నటించారు. ఆ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసే ఎన్నో బోల్డ్ సీన్స్ అందులో ఉన్నాయని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. దీన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చెయ్యడం పై ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటిలోకే విడుదల చెయ్యనున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో సెప్టెంబర్ 27 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా, ఇందులో శోభిత ధూళిపాళ ఓ కొత్త పెళ్లి కూతురి పాత్రలో నటిస్తుంది. లవ్, హార్ట్‌బ్రేక్, సెల్ఫ్ డిస్కవరీ అనే కాన్సెప్ట్‌లో ఈ సినిమా కథ సాగుతుందని మేకర్స్ తెలిపారు. ఈ మూవీను వందన్ కటారియా డైరెక్ట్ చేశారు. రిజుల్ రే, శంకర్ ఇంద్రఛూడన్, సీమా సాన్వీ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. మరి ఓటీటీ లో మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఆసక్తిగా మారింది.. దీని తర్వాత శోబిత తెలుగులో కూడా సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి వీరిని ఒకే స్క్రీన్ పై ఎప్పుడు చూస్తామో అని అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.