Saripoda Sanivaram OTT : టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ( Nani ) ఈ ఏడాది హాయ్ నాన్న ( Hai Nanna ) సినిమాతో సాలిడ్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన సరిపోదా శనివారం ( Saripoda Sanivaram ) మూవీ ఆగస్టు 29 న థియేటర్లలోకి విడుదలైంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. భారీ యాక్షన్ సన్నివేశాల తో వచ్చిన సినిమా నానికి మరో హిట్ ను అందించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైం కు కొత్త సినిమాలు లేవు.. అందుకే భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఇక తాజాగా ఓటీటీ అప్డేట్ కూడా వచ్చేసినట్లు తెలుస్తుంది. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయి లో ఈరోజు విడుదలైంది . తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యి అన్ని ప్రాంతాల్లో భారీ విజయాన్ని అందుకుంది. అయితే, మూవీలో హీరో ఎంట్రీతో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయనే టాక్ ను సొంతం చేసుకుంది.. అలాగే రేసీ స్క్రీన్ ప్లే, హై ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో ఎండింగ్ వరకు థ్రిల్లింగ్‌గా ఆకట్టుకునేలా ఉన్నాయని ఆడియన్స్ చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇక కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. రూ. 100 కోట్లకు పైగా రాబట్టింది. ఇక నెలలోపే ఓటీటీ లోకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీ పై వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ మూవీ ఓటీటీ అప్డేట్స్ జనాల్లో ఆసక్తిని కలిగిస్తుంది. నెలలోపే స్ట్రీమింగ్ కు రాబోతుందని టాక్. సెప్టెంబర్ ఓటీటీ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. సరిపోదా శనివారం ఓటీటీ లో సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుందట. ఈ డేట్ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం లో సరిపోదా శనివారం నెట్ఫ్లిక్స్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుందని పక్కా సమాచారం. అయితే, సరిపోదా శనివారం హిందీ వెర్షన్ మాత్రం మరో ఓటీటీ జియో సినిమాలో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్.. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకున్న ఈ సినిమా ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో రెండు మూడు సినిమాలల్లో నటిస్తున్నాడు. రీసెంట్ గా సైమా అవార్డ్స్ లో నాని సినిమాల కు అవార్డుల పంట పండింది..