Romantic Thriller OTT : ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తుంటాయి. అందులో హారర్ మూవీస్ ఫస్ట్ ప్లేసులో ఉంటాయి. ఆ తర్వాత రొమాంటిక్ మూవీస్ ఉన్నాయి. ఓటీటీలోకి వచ్చిన ప్రతి మూవీ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. అందుకే ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఇక్కడ సినిమాలు సందడి చేస్తున్నాయి. తాజాగా ఓ రొమాంటి క్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ మూవీ థియేటర్లలో కి వచ్చి నెల కూడా అవ్వలేదు. కానీ అప్పుడే ఓటీటీలోకి అడుగు పెట్టేసింది. అక్కడ డిజాస్టర్ అయ్యింది. ఇక ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి. ఆ మూవీ ఏంటో? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం..
ఇది ఒక హిందీ మూవీ.. హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఔరో మే కహా దమ్ థా” ( Ouro Me Kaha Dam Tha ) అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిన్నటి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా చూడాలంటే మాత్రం భారీగానే రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. రూ. 349కి ఈ సినిమా రెంట్ తీసుకొని చూడొచ్చు. థియేటర్స్‌లో డిజాస్టర్ అయిన సినిమాకు ఇక్కడ అంత చెల్లించి చూడటం ఏంటో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఈ రొమాంటిక్ సినిమా కథ విషయానికొస్తే.. సూపర్ జోడి అజయ్ దేవగన్ (Ajay Devagan), టబు (Tabu ) నటించిన సినిమా ఇది.. ఈ ఇద్దరూ కలిసి నటించిన పదో సినిమా కావడం విశేషం. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. నీరజ్ పాండే (Neeraj Pandey ) డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఓ జంట చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో హీరో, హీరోయిన్ల ప్రేమ దాదాపు 23 ఏళ్లు కొనసాగుతుంది. హత్య కేసుల్లో హీరోకు జైలు శిక్ష పడుతుంది. హీరో జైలుకు వెళ్లడంతో హీరోయిన్ మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. అయితే 22 ఏళ్ల తర్వాత కృష్ణ (అజయ్ దేవగన్)కు క్షమాభిక్ష పెట్టడంతో అతడు జైలు నుంచి విడుదలవుతాడు. ఆ తర్వాత అతడు వసుధ(టబు)ను కలుసుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత వాళ్ల జీవితాల్లో ఏం జరగింది అన్నది ఈ లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీలో చూడొచ్చు..
ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.. సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు దాంతో సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. తొలి రోజు అయిన ఆగస్ట్ 2న కేవలం రూ.1.85 కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే లభించాయి. 2024లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. ఏకంగా రూ.148 కోట్ల నష్టాలు వచ్చినట్లు భావిస్తున్నారు. ఇదే ఏడాది అజయ్ దేవగన్ కే చెందిన మైదాన్ కూడా భారీ డిజాస్టర్ అయ్యింది.. అక్కడ భారీ ప్లాఫ్ అయిన సినిమా ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..