Comedy Movie OTT : టాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనదైన ముద్ర వేసుకున్న నటుడు రావు రమేష్ ( Rao Ramesh) .. ఈయన ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ కామెడీ మూవీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం (Maruthi Nagar Subramanyam ).. ఆగస్ట్ 23న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఒక ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాగా, ఓ వర్గం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఆ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. థియేటర్లలో మంచి టాక్ ను అందుకుంది. నెలలోపే ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఈ మధ్య చిన్న సినిమాలుగా వచ్చిన సినిమాలు మంచి టాక్ ను అందుకుంటున్నాయి. ఈ సినిమా కూడా అలానే ఆకట్టుకుంది. ఈ చిత్రానికి థియేటర్లలో మంచి స్పందన లభించింది. ఇండియాలోనే కాదు అటు ఓవర్సీస్ లో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అమెరికాలో కూడా పాజిటివ్ టాక్ ను అందుకోవడం మాత్రమే కాదు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టి సక్సెస్ అయ్యింది. అయితే ఈ మూవీ వచ్చి నెల కూడా అవ్వలేదు. అప్పుడే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఎంత పెద్ద సినిమా అయినా నెల తిరగకుండా ఓటిటిలోకి విడుదల అవుతున్నాయి . ఇక ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే భారీ ధరకు ఓటీటీ డీల్ కుదుర్చుకుంది. ఆహా (Aha ) ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రావడం ఖరారైంది. ఈ విషయంపై ఆహా అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే డేట్ ను అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు..
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకొని పెద్ద స్థాయిలో విడుదల చేయడం వంటి అంశాలు బాగా కలిసి వచ్చాయి. అందుకే మూవీకి పాజిటివ్ టాక్ తో పాటుగా కలెక్షన్స్ కూడా అందుకుంది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడం తో బాలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి చూపుతున్నాయి. ముంబైలో ఉన్న ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ హిందీ రీమేక్ హక్కులను పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను అజయ్ దేవగన్ ( Ajay Devagan ) లేదా పంకజ్ త్రిపాఠి (Pankaj Tripati ) వంటి ప్రముఖ నటులతో రీమేక్ చేయాలని ఆ సంస్థ యోచిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై ఒక క్లారిటీ రాబోతుందని సమాచారం. హిందీ మాత్రమే కాదు తమిళంలో కూడా రీమేక్ చెయ్యనున్నారని సమాచారం. మరి అక్కడ ఎవరు ఈ మూవీలో రైట్స్ ను కొనుగోలు చేస్తారు. ఏ నటుడు నటిస్తారో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమాతో రావు రమేష్ మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.