Horror Thriller Movie: ఓటీటీలోకి కొత్త కొత్త కాన్సెప్ట్ లతో హారర్ సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. సైన్స్ కు అందని ఎన్నో మిస్టరీలు కలిగిన సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి. ఇక ఓటీటీలో సినిమాల కు ప్రేక్షకుల ముందు నుంచి రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూస్తున్నాం.. ప్రతి వారం కొత్త సినిమాలు విడుదల అవుతాయి. అందులో ఎక్కువగా హారర్ కాన్సెఫ్ట్ మూవీస్ ఎక్కువగా క్రేజ్ ను అందుకుంటున్నాయి. తాజాగా మరో కొత్త హారర్ సినిమా ఓటీటీలో కి విడుదల కాబోతుంది. ఆ సినిమా గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ప్రముఖ డైరెక్టర్స్ కారీ క్రౌస్ (Carry Crows ), విల్ జోన్స్ (Wills Jones) డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే అంతకంటే ముందు టొరొంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెప్టెంబర్ 12న ఈ సినిమాను స్ట్రీమింగ్ చెయ్యనున్నారు. థ్రిల్లర్ మూవీ పేరు హోల్డ్ యువర్ బ్రెత్ (Hold Your Breath). అక్టోబర్ 3 నుంచి ఈ సినిమా హులు (Hulu )తో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Hot Star ) లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా 1930 బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ వచ్చింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. అనుకోకుండా భూమి పై దుమ్ము దూళి తుఫాను చుట్టిముట్టింది. ఇక ఆ సమయంలో ఏవో అతీత శక్తి ఆ తుఫాను రూపంలో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుందని భావించి.. దాని నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసే పోరాటంగా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ముందుగా డస్ట్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించాలని భావించారు.. కానీ ఆ పేరు అంతగా క్యాచీగా లేదని ఆ తర్వాత హోల్డ్ యువర్ బ్రెత్ అంటూ టైటిల్ మార్చారు. అయితే ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయకుండా దీన్ని టొరొంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించి ఆ తర్వాత థియేటర్ల లో విడుదల చెయ్యాలని అనుకున్నారు. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి విడుదల చెయ్యనున్నారు. ఇలాంటి కథలతో వచ్చే సినిమాలు మంచి వ్యూస్ ను రాబడుతున్నాయి.. వచ్చే నెల ఈ మూవీని మీరు కూడా చేసెయ్యండి..
అలాగే ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే కొత్త సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందులో రీసెంట్ గా రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ (Mr.Bachchan) , కమిటీ కుర్రాళ్లు (Committe Kurrallu ) వంటి సినిమాలు కూడా ఉన్నాయి. అంతేకాదు వెబ్ సిరీస్ లు కూడా రిలీజ్ అవుతున్నాయి. మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి..