OTT : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వర్ధమాన తారలలో ఒకరైన శోభితా ధూళిపాళ తాజాగా నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకుని హాట్ టాపిక్ గా మారింది. అనురాగ్ కశ్యప్ ఘోస్ట్ స్టోరీస్‌లో చివరిగా కనిపించింది. ఆమె ఇప్పటికే మేజర్, కురుప్, పొన్నియన్ సెల్వన్, దేవ్ పటేల్‌తో హాలీవుడ్ చిత్రం మంకీ మ్యాన్ లో నటించి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఈ వైజాగ్ అమ్మాయి ఇప్పటి దాకా తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో భాషలలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసింది. అయితే పలు వెబ్ సిరీస్ లలో శోభిత నటించినప్పటికీ ఓ రెండు సిరీస్ లలో మాత్రం బో*ల్డ్ లుక్స్ తో చెమటలు పట్టించింది. మరి ఇప్పటిదాకా శోభిత బోల్డ్ సిరీస్ లతో పాటు పలు సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసుకుందాం.
మేడ్ ఇన్ హెవెన్
శోభిత మేడ్ ఇన్ హెవెన్ అనే రొమాంటిక్ డ్రామాతో OTT వెబ్ సిరీస్ ప్రపంచంలోకి లోకి ప్రవేశించింది. ఇందులో ఆమె కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి అదరగొట్టింది. ఇందులో శోభిత పేరు తారా ఖన్నా, న్యూ ఢిల్లీలో వెడ్డింగ్ ప్లానర్‌గా పని చేస్తుంది. ఒక మురికివాడలో పుట్టిన ఆమె రిచ్ ఫ్యామిలీలోకి కోడలిగా అడుగు పెడుతుంది. అయితే ఈ సిరీస్ లో పితృస్వామ్య వ్యవస్థ, భారతీయ వివాహాల వల్ల ఈ తరం యూత్ ఎదుర్కొంటున్న పరిస్థితులను చూపించారు. అలాగే ఇందులో కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ది నైట్ మేనేజర్
దీనితో పాటే నైట్ మేనేజర్ అనే మరో బోల్డ్ సిరీస్ లో కూడా శోభిత ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో ఓ బడా గ్యాంగ్ స్టర్ కు భార్యగా కన్పిస్తుంది. స్టోరీ ఏంటంటే.. శంతను సేన్‌గుప్తా అలియాస్ షాన్ సేన్‌గుప్తా మాజీ నేవీ లెఫ్టినెంట్, ఢాకాలోని ఓరియంట్ పర్ల్ హోటల్లో నైట్ మేనేజర్. అక్కడ హోటల్ యజమాని ఫ్రెడ్డీ రెహమాన్ భార్య అయిన 14 ఏళ్ల అమ్మాయి సఫీనా అతడిని సహాయం కోరుతుంది. ఫ్రెడ్డీ హోటల్ యజమాని మాత్రమే కాదు, అక్రమ ఆయుధాల వ్యాపారంలో పాల్గొన్న అంతర్జాతీయ ముఠా సభ్యుడు కూడా. సఫీనా నుండి ఈ విషయంలో సాక్ష్యం అందుకున్న తరువాత షాన్ సేన్‌గుప్తా ఆమెను రక్షించి, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సహాయంతో ఆమెను భారతదేశానికి పంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఫ్రెడ్డీ సఫీనా హత్యకు గురవుతుంది. ఈ అపరాధం షాన్ని వేధిస్తూనే ఉంటుంది. కొన్నాళ్ళ తరువాత రీసెర్చ్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఆఫీసర్ లిపికా సైకియా రావును ఒప్పించి షాన్ శైలేంద్ర సింగ్ రుంగ్తా రహస్య ముఠాలో చేరి గూఢచర్యం ప్రారంభిస్తాడు. అందులో భాగంగానే దారి తప్పి వచ్చిన వ్యక్తిలా స్మగ్లర్ ఇంటికి చేరతాడు. అలాగే ఆయన కూతురికి, భార్యకు దగ్గరవుతాడు. అంతేకాదు ముఠాలోని సభ్యుల మధ్య చిచ్చు రాజేసి స్మగ్లర్ కు కుడి చేతిలా మారతాడు. అతనికి దగ్గరగా ఉంటూనే పోలీసులకు పట్టించడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. షాన్ స్మగ్లర్ ను పట్టించడంలో సక్సెస్ అవుతాడా? సఫీనా మరణానికి అతను ప్రతీకారం తీర్చుకోగలడా? షాన్‌ను రుంగ్తా పట్టుకుంటాడా? షాన్ రుంగ్టా సామ్రాజ్యాన్ని కూల్చగలడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ది నైట్ మేనేజర్ సిరీస్ లో చూడవచ్చు.