OTT Series : అద్దంలో బందీ అయిన ఊరు… దాంట్లో నుంచి బయటపడాలంటే ఈ ఒక్కటే దారి

OTT Series : సైన్స్ ఫిక్షన్ సినిమాలకు పెట్టింది పేరు హాలీవుడ్. ఈ సినిమాలు ఇంట్రెస్టింగ్ స్టోరీతో, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి. ఈరోజు కూడా ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్ ను తీసుకొచ్చాము. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతోంది ? మూవీ పేరేంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇది సినిమా కాదు సిరీస్. ఈ వెబ్ సిరీస్ పేరు అండర్ ది డోమ్. బ్రియాన్ కే వాగన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ మొత్తంగా 39 ఎపిసోడ్లు ఉంది. 2013 జూన్ 24న ఈ సిరీస్లో మొదటి భాగం రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. సీరియల్స్ ను, విదేశీ వెబ్ సిరీస్ లను ఎక్కువగా ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. పైగా తెలుగులో కూడా అందుబాటులో ఉంది.Under the Dome - About the Show | Amblin

స్టోరీలోకి వెళ్తే…

బార్బీ అనే అతను తనతో గొడవ పడిన ఓ వ్యక్తిని చంపేసి పాతేస్తాడు. ఆ తర్వాత చెస్టర్స్ మిల్ అనే టౌన్ కి వెళ్తుండగా యాక్సిడెంట్ జరుగుతుంది. ఇదే సమయంలో పెద్ద భూకంపం సంభవిస్తుంది. ఏదో ఒక గుర్తు తెలియని ఆకారం ఆకాశం నుంచి భూమ్మీద పడుతుంది. అది మీద పడడంతో అక్కడున్న ఆవు రెండు ముక్కలవ్వడం బార్బీ చూస్తాడు. ఏమైందో దగ్గరికి వెళ్లి చూద్దాం అనుకునే లోపు ఏదో అడ్డు తగులుతుంది. అదెంత షార్ప్ గా ఉంటుందంటే ఇంటిని కూడా రెండు ముక్కలు చేస్తుంది. ఇదే విషయాన్ని జో అనే కుర్రాడు కూడా చూస్తాడు. ఇద్దరు కలిసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటారు. చివరికి అదొక ఇన్విజిబుల్ వాల్ అనే విషయాన్ని కనిపెడతారు. ఇక ఈ సంఘటన తర్వాత ఇంటర్నెట్, ఫోన్, కరెంట్ ఇలా ఏ ఒక్కటీ పని చేయదు.

- Advertisement -

అదే క్రమంలో ఈ టౌన్ మీద నుంచి వెళ్లే విమానం కూడా క్రాష్ అవుతుంది. కానీ జనాలకు మాత్రం ఏం కాదు. ఎలాగోలా ఎఫ్ఎం స్టేషన్ లోని జాకీలు డోమ్ బయట ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయి ఇక్కడ విషయాలన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే చెస్ట్ర్స్ మిల్స్ రోడ్డుపై యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. దీంతో పోలీసులు వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని అనుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే బయటి ప్రపంచంతో ఆ ఊరికి సంబంధాలు తెగిపోతాయి. ఆ తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు దాని దగ్గరకు వచ్చి పరిశోధనలు మొదలుపెడతారు. ఇక మరోవైపు ఈ ఊర్లో ఉన్న జనాల మధ్య ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? అసలు ఈ డోమ్ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? దాన్నుంచి జనాలు బయటపడే దారేంటి? అసలు బయట పడ్డారా లేదా? అనే విషయాలు తెలియాలంటే ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ పై ఓ లుక్కెయ్యండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు