OTT Movies : ప్రతి వారం కొత్త కంటెంట్ OTTలో విడుదలవుతుందన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని చూడాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. కొన్ని సినిమాలు, సిరీస్‌లు వారం ప్రారంభంలో విడుదలైతే మరికొన్ని వారం చివరిలో విడుదలవుతాయి. ఈ వారం ప్రైమ్ వీడియోలో విడుదల అవుతున్న కొన్ని సిరీస్‌ల గురించి ఇక్కడ మేము మీకు చెప్పబోతున్నాం. ముఖ్యంగా యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికోసమే ఈ ట్రిపుల్ ఎంటర్టైన్మెంట్. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాలు, సిరీస్ లు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి ? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
వన్ ఫాస్ట్ మూవ్
ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది వన్ ఫాస్ట్ మూవ్. ఈ సినిమా ఒక యాక్షన్-అడ్వెంచర్ థ్రిల్ రైడ్. మోటార్ సైకిల్ రేసర్ కావాలనే కోరికను తీర్చుకునేందుకు తండ్రి సహాయం కోరే యువకుడి కథ ఇది. కెల్లీ బ్లాట్జ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కెజె అపా, ఎరిక్ డేన్, మైయా రెఫికో, ఎడ్వర్డ్ జేమ్స్ ఓల్మోస్, ఆస్టిన్ నార్త్ నటించారు. ఈ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 8న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. కాబట్టి గెట్ రెడీ యాక్షన్ మూవీ లవర్స్.
ది హంగర్ గేమ్స్
ది హంగర్ గేమ్స్ అనేది సుజానే కాలిన్స్ రచించిన ది బల్లాడ్ ఆఫ్ సాంగ్‌బర్డ్స్ అండ్ స్నేక్స్ నవల ఆధారంగా తెరకెక్కిన యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ది హంగర్ గేమ్స్ త్రయం ప్రీక్వెల్ ఇప్పుడు తెరపైకి రాబోతోంది. ఇంతకుముందే ఈ ఫ్రాంచైజీలో రిలీజ్ అయిన సినిమాలకు విశేష ఆదరణ దక్కింది. ఒక్కో భాగం చూస్తున్నంత సేపు కళ్లార్పడం కష్టమే. ఒక్కో సీన్ కు ఒక్కో ట్విస్ట్ ఉంటూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తుంది. ఇక ఇప్పుడు రాబోతున్న హంగర్ గేమ్స్ ప్రీక్వెల్ ఫ్రాన్సిస్ లారెన్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాచెల్ జెగ్లర్, టామ్ బ్లైత్, వియోలా డేవిస్ నటించారు. ఇది ఆగస్టు 8న ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఒకవేళ ఈ మూవీని చూడాలి అనుకుంటే అంతకంటే ముందు వచ్చిన పార్ట్స్ ను చూడడం మరచిపోవద్దు.
డార్క్ విండ్స్ సీజన్ 1 & 2
డార్క్ విండ్స్ సీజన్ 1 & 2 అనేది గ్రాహం రోలాండ్ రూపొందించిన అమెరికన్ సస్పెన్స్ డ్రామా సిరీస్. సీజన్ 1 కథ 1971లో నవజో నేషన్ అవుట్ పోస్ట్‌లో సెట్ చేయబడింది. ఈ సిరీస్ లో జెహాన్ మెక్ క్లారెన్, కియోవా గోర్డాన్, జెస్సికా మాటన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయ్యింది. సస్పెన్స్ డ్రామాలను బాగా ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక ఈ వారం మీరు ప్రైమ్ వీడియో లో మీ భాగస్వామితో కలిసి ఇంట్లో ఈ మూడు షోలను చూస్తూ వీకెండ్ ను ఎంజాయ్ చేయవచ్చు.