OTT Movies : వివాదాస్పద అంశాలు ఉన్న సినిమాలు కొన్ని దేశాలలో అక్కడి రూల్స్ ప్రకారం బ్యాన్ అవుతాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాదారణంగా హాలీవుడ్ మూవీస్ లో అన్నీ అంశాలను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూపిస్తారు. అది బోల్డ్ కంటెంట్ అయినా లేదా వయొలెన్స్ అయినా. కానీ మన దేశం రూల్స్ ప్రకారం అక్కడి ప్రతీ సినిమా ఇక్కడ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. అలా కొన్ని కారణాల వల్ల ఇండియాలో బ్యాన్ అయిన సినిమాల సంఖ్య కూడా భారీగానే ఉంది. మరి ఆ సినిమాలను ఎందుకు ఇక్కడ బ్యాన్ చేశారో తెలుసుకుందాం పదండి.
ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ
‘ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ’ మూవీలో లైంగిక వేధింపులు, హింసను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చిత్రం వివాదాస్పదమైంది. ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు చాలా భయంకరంగా ఉన్నాయి. దీని కారణంగా భారతదేశంలో ఈ మూవీని బ్యాన్ చేశారు. మీరు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అనే ఓటీటీలో చూడవచ్చు.
ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్
‘ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్’ చిత్రంలో భారతీయ నాగరికత, సంస్కృతిని తప్పుగా చూపించారు. ఈ కారణంగా ఈ చిత్రం మన దగ్గర బ్యాన్ అయ్యింది. కానీ ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
మ్యాజిక్ మైక్ XXL
‘మ్యాజిక్ మైక్ XXL’ చిత్రంలో దాదాపు చాలా సన్నివేశాలు అశ్లీలంగా ఉన్నాయి. దీని కారణంగా ఇది భారతదేశంలో బ్యాన్ అయ్యింది. మీరు జియో సినిమాలో హాయిగా ఈ చిత్రాన్ని చూడవచ్చు.
బ్లూ జాస్మిన్
‘బ్లూ జాస్మిన్’ చిత్రంలో ధూమపానాన్ని విపరీతంగా ప్రచారం చేశారు. ఈ కారణంగా భారతదేశంలో నిషేధించబడింది. అయినప్పటికీ మీరు ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో ఉచితంగా చూడవచ్చు.
ది డావిన్సీ కోడ్
‘ది డావిన్సీ కోడ్’ చిత్రంలో మతాన్ని తప్పుగా చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఇది భారతదేశంలోనే కాకుండా మరికొన్ని దేశాల్లో కూడా నిషేధించబడింది. మీరు ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
ది హ్యూమన్ సెంటిపెడ్
ఓ సైకో సైంటిస్ట్ కథను ఈ సినిమాలో చూపించారు. ఇందులోని చాలా సన్నివేశాలు హింసాత్మకంగా, అశ్లీలంగా ఉన్నాయి. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది.
ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే
‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’లో హీరో, హీరోయిన్లు బట్టలు లేకుండా కనిపించిన సన్నివేశాలను చూపించారు. ఈ కారణంగా ఇది భారతదేశంలో నిషేధించబడింది. అయితే ఇది నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం అందుబాటులో ఉంది.
ఐ స్పిట్ ఆన్ యువర్ గ్రేవ్
‘ఐ స్పిట్ ఆన్ యువర్ గ్రేవ్’ చిత్రంలో ఒక అమ్మాయి వింత కథ గూస్‌బంప్స్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. సినిమాలోని కొన్ని సన్నివేశాల కారణంగా భారత్‌లో విడుదల చేయకుండా నిషేధం విధించారు.