OTT Movies : ప్రస్తుతం ఓటీటీ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి టాప్ ఓటీటీ సంస్థలకు భారీ సంఖ్యలో సబ్స్క్రైబర్లు ఉన్నారు. అందులో తెలుగు ఓటిటి ఆహా కూడా ఒకటి. ఇందులో అచ్చ తెలుగు కంటెంట్ ఉండడం వల్ల కంప్లీట్ తెలుగు సినిమాలను చూడాలి అనుకునే వారికి ఆహా బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఆహా లో ఉన్న బెస్ట్ తెలుగు హారర్ సినిమాలు ఈరోజు మన మూవీ సజెషన్. అందులో ఉండే నేపథ్య సంగీతం, ఊహించని ట్విస్టులు ఒక్కోసారి కొన్ని సెకండ్ల పాటు గుండె ఆగిపోయేలా చేస్తాయి. ఈ రేంజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకునే హారర్ మూవీ లవర్స్ ఆహా లో ఉన్న బెస్ట్ హారర్ మూవీస్ పై ఓ లుక్ వేయండి.
పిండం
భయపెట్టే హారర్ సినిమాలలో చెప్పుకోవాల్సిన మూవీ పిండం. సినిమాలో మేరీ అనే ఒక నిండు గర్భిణీ ఉంటుంది. ఆమె భర్త అంటోనీ ఒక పాత ఇంటిని కొంటాడు. ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఈ కుటుంబం అంతా కలిసి ఊర్లోని పాత ఇంటికి షిఫ్ట్ అవుతారు. కానీ అదే వాళ్లను ప్రమాదంలోకి నెడుతుంది. అక్కడికి వెళ్ళాక చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? అంటోనీ కుటుంబం ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుంది? అన్నమ్మ ఈ కుటుంబానికి ఎలా అండగా నిలిచింది? ఆ దెయ్యం ఆడపిల్లల్ని మాత్రమే ఎందుకు చంపుతుంది? అనే విషయాలు తెలియాలంటే ఈ పిండం మూవీని చూడాల్సిందే.
తంత్ర
సలోని, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ తంత్ర. ప్రమోషన్స్ తోనే తెలుగు మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ రక్తం తాగే దయ్యం స్టోరీ తో రూపొందింది. స్టోరీ లోకి వెళ్తే రేఖ అనే అమ్మాయికి తరచుగా దెయ్యాలు కనిపిస్తాయి. అయితే ఆమె వింత ప్రవర్తనము చూసిన లవర్ తేజా రేఖ గురించి ఆరా తీస్తాడు. ఈ నేపథ్యంలోనే ఆమెపై క్షుద్ర పూజలు జరిగినట్టుగా తెలుసుకుంటారు. ప్రతి పౌర్ణమికి రక్త దాహంతో రేఖ దగ్గరకు వచ్చే ఆ ఆత్మ ఎవరు? రాజేశ్వరి పాత్ర ఏంటి? వజ్రోలి రతి అనే క్షుద్ర పూజను ఎవరిమీద ఎందుకు ప్రయోగించారు? అసలు ఆ పూజను ఎందుకు చేస్తారు? అని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే తంత్ర అనే ఈ సినిమాను చూడాల్సిందే. అయితే సినిమాలో అన్ని కొత్త ముఖాలే అయినప్పటికీ ఓవైపు హారర్, మరోవైపు రొమాన్స్ మూవీని చక్కగా బ్యాలెన్స్ చేశారు.
మసూద
ఇక తెలుగులో ఉన్న బెస్ట్ హారర్ కామెడీ సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అందులో టాప్ ప్లేస్ లో ఉంటుంది మసూద. సాయికిరణ్ దర్శకత్వంలో తిరువీర్, సంగీత, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీని చూస్తే రాత్రి భయపడకుండా నిద్రపోవడం కష్టం. ఈ సినిమాలన్నీ కూడా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.