OTT Movie : ప్రస్తుతం ఓటీటిలో ఉన్న సినిమాల్లో లవ్ స్టోరీలకు కూడా క్రేజీ డిమాండ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి ఆహ్లాదకరమైన ఫీలింగ్ తెప్పించే సినిమాలు కొన్ని ఉంటాయి. మరికొన్ని మాత్రం రొమాంటిక్ జానర్లోనే తెరకెక్కినప్పటికీ కాస్త బో*ల్డ్ గా ఉంటాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఏకంగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఇద్దరమ్మాయిలు ఒకే అబ్బాయిని ఇష్టపడితే ఎలా ఉంటుంది అనేదే. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఆ మూవీ పేరేంటి? అని వివరాల్లోకి వెళ్దాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ఆసక్తికరమైన సినిమా ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ నిరాశను కలిగించే విషయం ఏమిటంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఇండియన్స్ చూసే అవకాశం లేదు. గుడ్ న్యూస్ ఏంటంటే ది పిక్సర్స్ అనే వెబ్సైట్ లో ఈ మూవీని ఎవరైనా చూడొచ్చు…. అలాగే ఇండియన్స్ కూడా. అయితే సినిమాలో మసాలా కంటెంట్ స్ట్రాంగ్ గానే ఉంటుంది కాబట్టి ఒంటరిగా చూస్తే మంచిది.
కథలోకి వెళ్తే…
ఈ సినిమాలో హీరోయిన్ పేరు క్రిస్టినా. ఆమె బెస్ట్ ఫ్రెండ్ పేరు విక్కి. వీళ్ళిద్దరూ కలిసి వెకేషన్ కోసం బంధువుల ఇంటికి వెళ్తారు. బార్సిలోనాలో ఉండే తన ఆంటీ ఇంటికి క్రిస్టినా విక్కిని తీసుకెళ్తుంది. అయితే అక్కడ వీళ్ళను ఒక కొత్త వ్యక్తి పరిచయం చేసుకుంటాడు. ముందుగానే వీళ్ళ ఆంటీ అతనితో మాత్రం మాట్లాడకూడదని హెచ్చరిస్తుంది. కానీ అతనేమో వచ్చి వచ్చి వీళ్ళిద్దరిని తగులుకుంటాడు. ఆ తర్వాత ఊరికే ఉండకుండా ముగ్గురం కలిసి కొన్నాళ్ళు జర్నీ చేద్దామని వీళ్ళని కన్విన్స్ చేస్తాడు. అతను విచిత్రంగా మాట్లాడినప్పటికీ వీరిద్దరూ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో ఓకే చెప్తారు. పైగా అతనితో ఉండడానికి క్రిస్టియన్, విక్కీ ఇద్దరు ఒప్పుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లాగా ఒకే ఇంట్లో ఉంటారు. ఇంకేముంది నెమ్మదిగా ముగ్గురి అభిరుచులు కలుస్తాయి. కానీ అనుకోని విధంగా విక్కీ క్రిస్టినాల మధ్య మాత్రం అభిప్రాయ భేదాలు మొదలవుతాయి. దీనంతటికి కారణం అతనే. ఎందుకంటే ఇద్దరికి అతను అంటే ఇష్టం కాబట్టి అతన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో అలా వివాదాలకు తేరలేపుతారు. అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరికీ దిమ్మతిరిగే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. నిజానికి వీళ్ళిద్దరి కంటే ముందే అతని జీవితంలో ఉన్న మరో అమ్మాయి ఉంటుంది. ఆమె ఒక్కసారిగా వీళ్ళ లైఫ్ లోకి వస్తుంది. పైగా హీరోతో తాను తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదని హెచ్చరించడంతో పాటు చంపే దాకా వెళ్తుంది. మరి ఇంతకీ వీళ్లిద్దరూ అతన్ని విడిచి పెట్టారా? అసలు ఆ మూడో అమ్మాయి ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే విక్కీ క్రిస్టినా బార్సిలోనా అనే మూవీని చూడాల్సిందే. ఒకవేళ ఇప్పటిదాకా ఈ సినిమాను చూడకపోతే బోల్డ్ మూవీ లవర్స్ డోంట్ మిస్.