OTT Movie : మలయాళ సినిమాలకు ఇప్పుడున్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సినిమా రిలీజ్ అయినా ఆ సినిమాను చూడకుండా మాత్రం వదలట్లేదు మూవీ లవర్స్. అయితే ఇప్పటిదాకా ఎన్నో రకాల మలయాళ సినిమాలను చూసే ఉంటారు. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ ముఖ్యంగా డాగ్ లవర్స్ కోసం. అలాగే సస్పెన్స్, కామెడీ, హర్రర్, యాక్షన్ లాంటి రెగ్యులర్ జానర్ల మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యి, ఫీల్ గుడ్ సినిమా కోసం వెతుకుతున్న వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? సినిమా పేరేంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్…
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ చిన్న పిల్లలకు, ప్రత్యేకంగా డాగ్ మూవీ లవర్స్ కు మంచి ట్రీట్ అవుతుంది. ఇప్పటిదాకా డాగ్స్ పై పలు సినిమాలు వచ్చినప్పటికీ ఇటీవల కాలంలో రిలీజ్ అయిన చార్లీ 777 మూవీ అందరినీ మెప్పించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా నచ్చిందంటే డాగ్ మూవీ అంటే చార్లీ 777 పేరే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ అది కాదు. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు దేవన్ జయకుమార్ దర్శకత్వం వహించగా, రవినా రవి, రోషన్ మాథ్యూ, షౌభిన్ షాహిర్, సన్నీ వైన్, అజు వర్గీస్, రజిని హరిదాస్, సైజు కురుప్, ఇంద్రన్స్ లాంటి స్టార్స్ సినిమాలో ఉన్న డాగ్స్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. థియేటర్లలో ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. అలాగే ఓటీటీలో కూడా ఈ మూవీ భారీ సంఖ్యలో వ్యూస్ తో దూసుకెళ్తోంది.
స్టోరీ ఏంటంటే…
ఈ సినిమాలో కుక్కల మధ్య లవ్ స్టోరీని చూపించారు. ఒక గోల్డెన్ రిట్రీవర్ డాగ్ పేరు టామీ. బ్రాహ్మణ కుటుంబంలో పెరిగే కాకర్ స్పెనియర్ డాగ్, టామ్ కి మధ్య లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ లో రెండు కుక్కలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈ డాగ్స్ కి ఒక స్ట్రీట్ డాగ్ ఎలా హెల్ప్ చేసింది అన్నదే స్టోరీ. సినిమాలో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఎలిమెంట్స్ తో పాటు కొంచెం కామెడీ మరి కాస్త ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా కేవలం ఒక గంట 53 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. చివరిదాకా మంచి ఫీల్ గుడ్ మూవీని చూసిన ఎక్స్పీరియన్స్ ఇచ్చే వాలట్టి మూవీని ఇప్పటిదాకా చూడకపోతే డోంట్ మిస్.