OTT Movie : హారర్ మూవీ లవర్స్ ఇందులో కూడా కాస్త కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఊరికే హారర్ సినిమాలలో అప్పుడప్పుడు వచ్చిపోయే దయ్యాల కంటే భయపెట్టే స్క్రీన్ ప్లేతో పాటు ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటేనే సినిమాను ఆదరిస్తున్నారు. దాన్నే హర్రర్ మూవీ అంటున్నారు. ఇక ఈరోజు కూడా మనం చెప్పుకోబోయే మూవీ అలాంటి హారర్ మూవీనే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? సినిమా స్టోరీ ఏంటి? వివరాల్లోకి వెళితే….
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…
సాధారణంగా దెయ్యం సినిమాలు అనగానే ఎవరో ఒకరికి దెయ్యం పట్టడం, పిశాచాలు లేదా దయ్యాలు పగ తీర్చుకోవడం, ఓ బంగ్లా నేపథ్యంలో కథ సాగడం వంటి హారర్ సినిమాలను చాలానే చూసాము. కానీ ప్రస్తుతం ట్రెండ్ మాత్రం క్షుద్ర పూజలు, బొమ్మలో ఉండే ఆత్మలు వంటి కథ, కథనమే. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
స్టోరీ ఏంటంటే…
ఓపెన్ చేస్తే ఓ అపార్ట్మెంట్లో ఒక బొమ్మ ఉంటుంది. ఒక అమ్మాయి ముందుగా అందంగా ముస్తాబయి మరి కాసేపటికి అదే బొమ్మను పట్టుకుని బాత్ టబ్ లో ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఇన్స్టాలో సాంగ్స్ పాడుతూ పాపులర్ అయిపోవాలి అనేది ఆమె కోరిక. అందుకే ఎప్పటికప్పుడు లైవ్ లో పాటలు పాడుతూ ఏదో ఒక రోజున పెద్ద సింగర్ అవుతాను అని కలలు కంటుంది. అయితే వాళ్ళ నాన్నకు తెలియకుండా ఇలా సీక్రెట్ గా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే ఆమెను ఇంట్లో వాళ్ళు బయటకు పంపరు. ఇక ఆ తర్వాత సినిమా మొదట్లో చనిపోయిన అమ్మాయి ఒక గ్రేట్ సింగర్ అనే విషయం బయటకు వస్తుంది. సెలబ్రిటీ మేటర్ కాబట్టి వెంటనే ఆ విషయం వైరల్ అవుతుంది. అసలే ఆమె చనిపోయిందనే షాక్ లో ఉన్న హీరోయిన్ కి పోలీసులు ఆమె మీకు బాగా క్లోజ్ కాబట్టి మిమ్మల్ని ఇంటరాగేట్ చేస్తామని చెప్పి తీసుకెళ్లి మరో షాక్ ఇస్తారు. ఇక ఇంటరాగేషన్ రూమ్ లో ఆ సింగర్ కు ఏదైనా అబ్ నార్మల్ డిసీజ్ ఉందా అని ప్రశ్నిస్తారు. దానికి ఒక బొమ్మ ఆమె చేతిలో ఉండడమే కారణమని చెప్తారు. హీరోయిన్ పైకి తనకేం తెలియదని చెప్పినప్పటికీ తన గతాన్ని నెమరు వేసుకుంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు ఊహించని విధంగా కొన్ని వింత సంఘటనలు ఎదురవుతాయి. పైగా చనిపోయిన సింగర్ అంత్యక్రియలకు వెళ్లి తనను క్షమించమని వేడుకుంటుంది. అసలు సింగర్ కి ఈమెకి ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో ఆ బొమ్మ ఎందుకు వచ్చింది? హీరోయిన్ గతం ఏంటి? సింగర్, హీరోయిన్ మధ్య ముందే పరిచయం ఉందా? అసలు ఆమె ఆత్మహత్యకు కారణం ఎవరు? అనే విషయాలు తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ద గార్డియన్ అనే సినిమాను చూడాల్సిందే.