OTT Movie : పెళ్లయ్యాక శోభనం గదిలోకి కాకుండా ఆ గదిలోకి… పెళ్లి పిచ్చి ఉన్న అమ్మాయిలు డోంట్ మిస్

OTT Movie : సాధారణంగా పెళ్లి అనేది ఇండియాలోనే కాదు ఎక్కడైనా ఎన్నో కలలతో ముడిపడి ఉంటుంది. ఇక భారత దేశంలో అయితే అత్తారింటి మనుషులు ఎలా ఉంటారు వాళ్ళ పద్ధతులు ఏంటో తెలియకుండానే ఆ ఇంట్లో అడుగు పెడుతుంది పెళ్లి కూతురు. ఇక ఆ తర్వాత జీవితాంతం వాళ్లతోనే కలిసి ఉండాలి. అయితే సాధారణంగా పెళ్లి కాగానే శోభనం గదిలోకి పాలు ఇచ్చి పంపించడం అనేది మనం ఎన్నో సినిమాల్లో చూసాము. కానీ ఈ సినిమాలో మాత్రం పెళ్లయిన కొత్త పెళ్లి కూతుర్ని మరో గదిలోకి పంపిస్తారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ పేరేంటి? ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ ఇప్పటిదాకా చదివిన దాన్ని బట్టి బోల్డ్ మూవీ అనుకుంటున్నారేమో అస్సలు కాదు. ఇదొక సస్పెన్స్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. నెట్ ఫ్లిక్స్ లో మంచి ఆదరణ దక్కించుకున్న ఈ మూవీ పేరు డామ్సెల్. డైరెక్టర్ జువాన్ కార్లోస్ ఈ మూవీని మంచి థ్రిల్లింగ్ అంశాలతో ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దారు. సర్వైవల్ థ్రిల్లర్ అనగానే మంజుమ్మెల్ బాయ్స్ లాగా సాఫ్ట్ గా, ఎమోషనల్ గా ఉంటుంది అనుకుంటున్నారేమో అప్పుడప్పుడు గుండె దడ పుడుతుంది. కాబట్టి మీ గుండెను పదిలంగా పెట్టుకోండి. మరి అసలు స్టోరీ ఏంటో చూసేద్దాం పదండి.

Damsel Full Movie 2024 Fact | Millie Bobby Brown, Angela Bassett, Robin Wright | Review And Facts

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఓ రాజ్యంలో కరువు వల్ల ప్రజలంతా అష్ట కష్టాలు పడతారు. అదే సమయంలో ఓ ధనిక రాజ్యానికి చెందిన యువరాజు హెన్రీతో ఈ దేశ యువరాణి ఎలోడీకి పెళ్లి సంబంధం వస్తుంది. ఈ కరువు ప్రాంతం యువరాణి ఎలోడీ అతన్ని పెళ్లి చేసుకుంటే తన రాజ్య ప్రజలు కష్టాలు అన్ని తొలగి, సంతోషంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇష్టం లేకపోయినా పెళ్లికి రెడీ అవుతుంది. పెళ్లి కాకముందే అత్తారింటి రాజ్యానికి వెళ్తారు ఎలోడీ కుటుంబం మొత్తం. అయితే ఏలోడి సవతి తల్లి మాత్రం అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంది. ఇదంతా పెద్దగా పట్టించుకోని ఎలోడీ యువరాజు హెన్రీ నచ్చి అతనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

ఇక పెళ్లయిన వెంటనే ఆమెను ఓ పెద్ద పర్వతం దగ్గరకు తీసుకెళ్తారు. గతంలో తమ దేశ మంచి కోసం అక్కడే ఉన్న డ్రాగన్ కు తమ పూర్వీకులు ప్రాణాలు అర్పించారని రాణి ఇసబెల్ ఓ స్టోరీ చెప్తుంది. దీంతో ఆ దేశ చరిత్ర ఇంట్రెస్టింగ్ గా ఉందని అనుకుంటుంది ఎలోడీ. ఇక రాణి అదే పర్వతం దగ్గర ప్రిన్సెస్ ఎలోడీ, ప్రిన్స్ హెన్రీ చేతులపై కత్తితో కోసి వారిద్దరి రక్తం కలిసేలా చేతులు కలుపుతుంది. తరువాత హెన్రీ ఆమెను ఎత్తుకొని తీసుకెళ్లి సడన్ గా ఓ గుహలో పారేస్తాడు. దీంతో అప్పుడు ఎలోడీకి కళ్ళు తెరుచుకుంటాయి. తనను ట్రాప్ చేసి డ్రాగన్ కు బలివ్వడానికే పెళ్లి చేసుకున్నారని అర్థం చేసుకుంటుంది. మరి ఆ డ్రాగన్ నుంచి ఎలోడీ తప్పించుకుందా? తనను తినాలని చూసిన డ్రాగన్ ని యువరాణి ఎలా మచ్చిక చేసుకుంది? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని తెరపై వీక్షించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు