OTT Movie : హీరోయిన్ మెహ్రీన్ (Mehreen) కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి మొదటి నుంచి అదృష్టం కలిసి రావట్లేదు. ముందుగా కృష్ణగాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఫస్ట్ మూవీనే నాని లాంటి నేచురల్ స్టార్ తో నటించి, ఆ తర్వాత వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలతో జతకట్టే అవకాశం దక్కించుకుంది. కానీ ప్రస్తుతం మెహ్రీన్ (Mehreen)కు అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా కనుమరుగయింది. తాజాగా ఆమె నటించిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగు మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. అయితే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన ఏడాది తర్వాత సైలెంట్ గా ఓటీటీలోకి వస్తోంది. మరి ఈ మూవీ పేరేంటి, ఎక్కడ చూడొచ్చు? అనే విషయంలోకి వెళ్తే…
సన్ నెక్స్ట్ ( Sun Nxt) లో అందుబాటులో…
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీతో విక్రాంత్ హీరోగా తెలుగు తెరపైకి అడుగు పెట్టాడు. ఇందులో మెహరిన్ (Mehreen)తో పాటు రుక్సార్ థిల్లాన్ కూడా హీరోయిన్ గా నటించింది. గత ఏడాది నవంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యిందనే చెప్పాలి. అయితే విక్రాంత్ ఈ సినిమాకు కేవలం హీరోనే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ కూడా. కానీ మొదటి సినిమాతోనే కనిపించకుండా పోయాడు ఈ హీరో. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీస్ ఆశు రెడ్డి (Ashu Reddy), లహరి (Lahari), సత్యా, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సుహాసిని వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ ఎలాంటి అప్డేట్ లేకుండానే సన్ నెక్స్ట్ లో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ ఏంటంటే…
ఈ మూవీ కంప్లీట్ గా సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. హైదరాబాదులో వరుస హత్యలు జరుగుతాయి. అందులోనూ అమ్మాయిలే చనిపోతారు. హీరోయిన్ మెహరీన్ (Mehreen) ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు తన బాయ్ ఫ్రెండ్ విక్రాంత్ తో ఈ కేసుకు సంబంధం ఉందని తెలుస్తుంది. అలాగే మరోవైపు విక్రమ్ ప్రేమించిన మరో అమ్మాయి కూడా అర్ధాంతరంగా చనిపోతుంది. హీరోయిన్ కి తన లవర్ పైనే అనుమానం మొదలవుతుంది. అసలు విక్రాంత్ బ్యాగ్రౌండ్ ఏంటి? ఎవరు వరుస హత్యలు ఎవరు చేస్తున్నారు? హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కు ఈ హత్యలతో సంబంధం ఉందా? చివరికి హీరోయిన్ ఏం కనిపెట్టింది? అనే విషయాలు తెలియాలంటే ప్రస్తుతం సన్ నెక్స్ట్ (Sun Nxt) అనే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న స్పార్క్ (Spark) అనే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే. థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చు స్పార్క్ మూవీకి ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. అయితే క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్ ఈ సినిమాను సరదాగా చూసేయొచ్చు.