OTT Movie : దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది ఒక ఆసక్తికరమైన టాపిక్ అయితే, నరకం స్వర్గం అనేది మరో ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ స్వర్గం నరకం అనే స్టోరీ వినడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి. దేవుడిని నమ్మేవారు మనిషిగా మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారని, తప్పులు చేస్తే నరకానికి వెళ్తారని అంటూ ఉంటారు. అయితే నరకానికి వెళ్తే అక్కడ రకరకాల శిక్షలు వేస్తారని, వేడి వేడి నూనెలో వేయిస్తారని రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో తెరకెక్కిన ఒక హారర్ మూవీ నే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఇప్పటిదాకా ఈ సినిమాను మీరు చూసారా లేదా అనే విషయంపై లుక్కెయ్యండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్…
నరకం స్వర్గం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కే హారర్ సినిమాలు చాలా అరుదు అని చెప్పాలి. అసలు ఆ కథలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ అలాంటి స్టోరీతో వచ్చే సినిమాలు మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికి వస్తే…
సినిమాలో భార్య భర్తలు ఉంటారు. వాళ్లకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరూ మగ పిల్లలు ఉంటారు. అయితే ఈ దంపతులిద్దరూ ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలకు వెళ్లి ఆ కార్యక్రమాలను జరిపిస్తారు. ఇక ఇలాంటి పని చేస్తున్న క్రమంలోనే ఒక మహిళ చనిపోతే ఆ కార్యక్రమం కోసం నలుగురు పిల్లలను తీసుకొని అక్కడికి వెళ్తారు. అయితే చావుకు సంబంధించిన పనులు చేసే ఫ్యామిలీలో పుట్టిన ఆ పిల్లలు తప్పు చేస్తే నరకం లేదంటే స్వర్గం అనే స్టోరీలను తల్లిదండ్రుల ద్వారా వింటూ పెరుగుతారు. ఇక తాజాగా జరిగిన చావు కార్యక్రమంలో కూడా పిల్లలు ఇదే టాపిక్ గురించి మాట్లాడతారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ పిల్లల్లో ఉన్న ఒక అమ్మాయికి చనిపోయిన డెడ్ బాడీని ఎవరో కట్టేసిన సీన్ కనిపిస్తుంది. ఆమెకు తప్ప ఎవరికీ ఇది కనిపించదు. ఇక దాన్ని చూసి ఆ అమ్మాయి ఒక్కసారిగా ఆమె నరకంలో ఉందంటూ అందరి ముందు ఆరుస్తుంది. దీంతో షాక్ అయిన ఆ కుటుంబం అక్కడ నుంచి పిల్లల్ని పంపించేస్తుంది. ఆ తర్వాత పదేళ్లకి ఈ నలుగురు పిల్లలు లైఫ్లో సెటిల్ అవుతారు. అయితే చిన్న కూతురు మాత్రం పాటలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ తల్లిదండ్రులకు అది నచ్చక పోవడంతో వాళ్లకు చెప్పకుండా సింగింగ్ కాంపిటీషన్ కి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆమెకు ఓ అనుకోని సంఘటన ఎదురు కావడం, మరోవైపు డెత్ సెర్మనీకి వెళ్ళిన ఆమె తల్లిదండ్రుల ముందే ఓ బాడీ లేచి అరవడం వంటి భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. అసలు ఆ ఫ్యామిలీకి ఏం జరుగుతోంది అనే విషయం తెలియాలంటే శిక్సా నేరక అనే ఈ సినిమాను చూడండి.