OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఎంత ఎంగేజింగ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లాంగ్వేజ్ తో, జానర్ తో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే చాలు అనుకునే మూవీ లవర్స్ కి, అలాగే సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంటే చెవి కోసుకునే వారికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ బెస్ట్ సజెషన్ అని చెప్పొచ్చు. ఓటిటిలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, కామెడీ, హారర్ సినిమాలకు ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. వీటన్నిటి తర్వాత ప్రేక్షకులు వెతికేది సైన్స్ ఫిక్షన్ సినిమాల కోసమే. ఇక ఈ మూవీ ఏలియన్స్ గురించి ఉంటుంది. మరి ఈ సినిమా పేరేంటి? ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
హాట్ స్టార్ లో స్ట్రీమింగ్…
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ తెలుగులో అందుబాటులో లేదు. లాంగ్వేజ్ బారియర్ అడ్డు కాదు అనుకునే వారు ఈ సినిమాను ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడండి.
స్టోరీ లోకి వెళ్తే…
సినిమాలో సిటీకి దూరంగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతుంది హీరో ఫ్యామిలీ. ఆ ఇంట్లో హీరోతో పాటు తన తమ్ముడు, కొడుకు, కూతురు కూడా కలిసి జీవిస్తారు. నిజానికి అతను ఇంతకుముందు ఒక చర్చ్ ఫాదర్ గా ఉండేవాడు. భార్య చనిపోయిన తర్వాత మొత్తానికే దేవుడిని నమ్మడం మానేసి నాస్తికుడిగా మారతాడు. పిల్లలతో హ్యాపీగా ఫార్మ్ పనులు చేసుకుంటూ బతుకుతాడు. అయితే వ్యవసాయం చేసుకుంటుండగా అనుకోకుండా ఓ రోజు పక్క పొలంలో పిల్లల అరుపులు వినిపించడం అతనికి విచిత్రంగా అనిపిస్తుంది. అసలు అక్కడ ఎవరున్నారో చూద్దామని హీరో తన కూతురితో కలిసి ఆ పొలంలోకి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్తే తీరా పంట పొలంలో మొక్కలన్ని విరిగిపోయి పెద్ద పెద్ద విచిత్రమైన ఆకారాలు ఎవరో కావాలని క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తాయి. వెంటనే హీరో పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేసి చెప్పడంతో అక్కడ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. పైగా అది టీవి ఛానల్ లలో కూడా వైరల్ అవుతుంది. మరో వైపు అక్కడ ఉండే జంతువులన్నీ విచిత్రంగా ప్రవర్తిస్తాయి. ఓ రోజు నిద్రపోతున్న హీరో దగ్గరికి తన కూతురు వచ్చి బయట ఏదో మాన్స్టర్ ఉంది, ఒక గ్లాస్ వాటర్ కావాలి అని అడుగుతుంది. హీరో భయపడుతూ ఆలోచనలో పడతాడు. అంతలోపే ఏదో ఒక పెద్ద ఆకారం ఇంటి పై ఉందనే విషయాన్ని గమనిస్తాడు. మళ్లీ అలాగే జరుగుతుంది అంటూ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు. అసలు హీరో ఏం రిపీట్ అవుతుందని చెప్తున్నాడు? ఏలియన్స్ అక్కడికి ఎందుకు వచ్చాయి? ఆ ఫ్యామిలీ ఏలియన్స్ నుంచి తప్పించుకుని బతికి బయట పడగలిగిందా? అనే విషయాలు తెలియాలంటే సైన్స్ అనే ఈ అదిరిపోయే సైన్స్ ఫిక్షన్ సినిమాను చూసి తీరాల్సిందే.