OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రస్తుతం ఓటీటీలో ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ జానర్ లో వాస్తవంగా జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తే ఓటిటి ఊగిపోవడం ఖాయం. ఇప్పుడు అదే జరుగుతోంది. తాజాగా ఇలాంటి సినిమానే ఒకటి ఓటిటి లోకి వచ్చేసింది.. పైగా అందులో ఒక పాపులర్ హీరో నటించాడు. మరి ఆ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్…
తాజాగా దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ రిలీజ్ అయింది. పైగా అది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి ఈ వీకెండ్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీకి ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించగా, 12th ఫెయిల్ (12th Fail)తో పాపులర్ అయిన హీరో విక్రాంత్ మస్సే (Vikranth Massey) హీరో పాత్రను పోషించారు. ఆయన చేసే సినిమాలు మంచి కంటెంట్ తో ఎంతగా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుచో అహ్మద్, బహురున్ ఇస్లాం, తనుశ్రీ దాస్, సుబీర్, కుచో అహ్మద్, ఆకాష్ ఖురాన, దీపక్, దర్శన్ జరివాలా కూడా ఇందులో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫిక్స్ లో అందుబాటులో ఉంది. అయితే ఈ మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం.
స్టోరీ లోకి వెళ్తే…
ఇప్పటికే ఈ మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కింది అన్న విషయాన్ని చెప్పుకున్నాం. ఆ వాస్తవ సంఘటన ఏదో కాదు 2006లో దేశం మొత్తాన్ని భయంతో వణికించిన స్టోరీ ఇది. నోయిడా లోని నిటారి అనే ఊరిలో జరిగింది ఈ సంఘటన. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారడంతో పాటు గుండెలు గుభేల్ మనిపించింది. చిన్న పిల్లల్ని ముఖ్యంగా ఆడ బిడ్డలను బయటకు పంపాలంటేనే తెగ భయపడ్డారు. ఇక స్టోరీలోకి వెళ్తే నిటారి అనే ఊర్లో ఒకే చోట కుప్పలు తిప్పలుగా అస్థి పంజరాలు కన్పిస్తాయి. పోలీసులు ఆ కేసును ఇన్వెస్ట్గేట్ చేయగా అవన్నీ అప్పటి వరకు తప్పిపోయిన చిన్నారులవని తేలుతుంది. ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ చిన్న పిల్లలపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్టుగా దర్యాప్తులో కనుగొంటారు పోలీసులు. అప్పట్లో ఆ కేసులో ఏం జరిగింది? చిన్న పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేశారు? అసలు ఆ హత్యలు చేసింది ఎవరు? పోలీసులు ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు అనే విషయాన్ని ఈ మూవీలో చూపించారు. ఆ మూవీ మరి ఏదో కాదు సెక్టార్ 36 (Sector 36). ఈ వీకెండ్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ డైన ఉంది అంటే అది ఇదే. పైగా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి సెక్టార్ 36 (Sector 36) మూవీ నెట్ ఫ్లిక్స్ లో చూసి ఈ వీకెండ్ ను ఎంజాయ్ చేయండి.