OTT Movie : ప్రేమ అనేది చెప్పలేని ఒక అందమైన అనుభూతి అని అంటూ ఉంటారు ప్రేమికులు. అంతేకాదు ఈ మాయదారి ప్రేమ ఎప్పుడు, ఎవరి మీద, ఎందుకు, ఎలా పుడుతుందో ఊహించడం చాలా కష్టం. అయితే చాలా కాలం క్రితం వరకు ప్రేమ అనగానే అమ్మాయి అబ్బాయి మధ్య నడిచే అందమైన అనుబంధం అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. చాలా దేశాల్లో ఇద్దరు అబ్బాయిల మధ్య లేదా ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ పుట్టడమే కాదు పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. కానీ కొన్నిచోట్ల ఇలాంటి విషయాలను జనాలు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. కొన్ని దేశాల్లో అయితే ఇలా చేయడం చట్టరీత్యా నేరం. ఈరోజు మన మూవీ సజెషన్లో ఇలాంటి మూవీ గురించే మాట్లాడుకోబోతున్నాం. ప్రేమించుకున్నా పెళ్లి చేసుకునే అదృష్టం లేని ఒక క్రేజీ లవ్ స్టోరీ ఏ ఓటీటీలో ఉంది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…
ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మూవీ ఇద్దరమ్మాయిల మధ్య నడిచే ప్రేమ గురించి. సినిమా మొత్తం ఆ ఇద్దరి మధ్య ఎలా ప్రేమ పుట్టింది? ఆ తరువాత జరిగే పరిణామాలు ఏంటి? అనే విషయాల నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా పేరు పొట్రైట్ ఆఫ్ ఏ లేడీ ఆన్ ఫైర్. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ ఏంటంటే..
ఇందులో హీరోయిన్ కి పెళ్లి చేయాలనుకుంటారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే ఆమె చిత్రపటం నచ్చితేనే పెళ్లి చేసుకుంటామని అవతలి వాళ్ళు షరతు పెడతారు. హీరోయిన్ అలా తన ఫోటోను గీయించుకోవడానికి అసలు ఒప్పుకోదు. దీంతో అప్పటికే ఆమెకు సంబంధించిన సగం పెయింటింగ్ పూర్తయి ముఖం లేకుండా పెండింగ్ లో ఉండిపోతుంది. దీంతో ఆ అమ్మాయి ఫోటోను గీయడానికి మరో హీరోయిన్ ని రంగంలోకి దించుతారు. అయితే ఆమెను పెయింటర్ గా కాకుండా ఫ్రెండ్ లా పరిచయం చేస్తారు. రెండో అమ్మాయి కూడా హీరోయిన్ కోసం ఐలాండ్ కి చేరుకుంటుంది. పైగా ఆమెతో ఫ్రెండ్లీగా చనువుగా ఉంటూనే ఆమె పెయింటింగ్ వేయడం మొదలు పెడుతుంది. కానీ ఈ రెండవ అమ్మాయికి ఉన్న షరతు ఏంటంటే ఆమె హీరోయిన్ పెయింటింగ్ వేస్తున్నట్టు హీరోయిన్ కి తెలియకూడదు. దీంతో ఆ రెండో అమ్మాయి ఎలాగైనా సరే ఈ పనిని చేయాలని డిసైడ్ అయ్యి ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ పెయింటింగ్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని రోజులకే వీరి మధ్య గాడ స్నేహం కుదురుతుంది. ఆ తర్వాత ఇద్దరమ్మాయిల మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. అంతేకాకుండా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చూపించుకోవడానికి హద్దులు దాటేస్తారు. మరి చివరికి రెండవ అమ్మాయి హీరోయిన్ పెయింటింగ్ వేయగలిగిందా? అసలు ఆ అమ్మాయి తన పెయింటింగ్ వేయడానికే వచ్చిందన్న విషయం హీరోయిన్ కి తెలిసిందా? వీరిద్దరి ప్రేమ గురించి తెలిసిన పెద్దలు ఎలా రియాక్ట్ అయ్యారు? అనే విషయం తెలియాలంటే ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ సినిమాను చూడాల్సిందే.