OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయంటే చూస్తున్నకొద్దీ చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫ్యూజులు అవుట్ అయిపోయే విధంగా ఉండడం అనేది ఈ సినిమాల్లో ఉండే ప్లస్ పాయింట్. ఇక ఈరోజు మనం చెప్పుకుంటున్న మూవీ కూడా ఇలాంటిదే. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మర్చిపోలేని క్లైమాక్స్ అనగానే దృశ్యం మూవీనే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ క్లైమాక్స్ అంతకుమించి అన్నట్టుగా ఉంటుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ అండ్ క్రైమ్ మూవీ స్టోరీ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీలో టైటిల్ లో ఉన్నట్టుగానే హీరోయిన్ తన భర్త కోసం అతని ముందే మరో వ్యక్తితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. అది చాలాదన్నట్టు ముగ్గురూ కలిసి క్రైమ్ ల మీద క్రైమ్స్ చేస్తూ ఉంటారు. ప్రేమ పేరుతో వరుస హత్యలు చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెడతారు. ఇక సినిమా అంతా సీను సీనుకో ట్విస్ట్ అన్నట్టుగా ఉంటుంది. చివరి అరగంట మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ ఏంటంటే…
ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అందులో హీరో హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. కానీ మధ్యలో అతని కజిన్ వచ్చి హీరోయిన్ తో రిలేషన్ స్టార్ట్ చేస్తాడు. అతని నిజ స్వరూపం తెలిసాక హీరో హీరోయిన్ ఒక్కటై బంధువు అని కూడా చూడకుండా అతనిని లేపేస్తారు. ఇక రెండో పార్ట్ స్టార్టింగ్ లోనే హీరోయిన్ బ్యూటీషియన్ గా, ఇండిపెండెంట్ గా ఒక్కతే ఉంటుంది. హీరో సీక్రెట్ గా వచ్చి ఆమెను కలుస్తాడు. పోలీసులు ఓవైపు హీరోయిన్ పై కన్నేసి ఉంచడమే కాకుండా హీరో గురించి వెతుకుతూ ఉంటారు. అతను చనిపోయాడు అన్న విషయాన్ని పోలీసులు అస్సలు నమ్మరు. ఇంతలోనే ఓ డాక్టర్ హీరోయిన్ పై ఇష్టం పెంచుకుంటాడు. అయితే ఒకానొక సమయంలో హీరోని జైలు పాలు కాకుండా రక్షించడం కోసం హీరోయిన్ ఏకంగా ఈ డాక్టర్ని పెళ్లి చేసుకుంటుంది. హీరో ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పిన వినకుండా అతనిని ఒప్పించి మరి పెళ్లి చేసుకుంటుంది. అతనేమో వీళ్లిద్దరిని మించిన సైకో. ఇంకేముంది ఓ రోజు తన సొంత వాళ్ళనే అతను చంపేశాడు అనే విషయం తెలుసుకున్న హీరోయిన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అతని నుంచి తనను, తన భర్తను కాపాడమని పోలీసులకు మొరపెట్టుకుంటుంది. అప్పుడే పోలీసులు హీరోయిన్ ద్వారా హీరోని పట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టుగానే హీరో బయటకు వచ్చి హీరోయిన్ ని వదిలేస్తే తను లొంగిపోతానని చెప్తాడు. కానీ తీరా ఈ లొంగిపోయే క్రమంలోనే ముగ్గురూ మొసళ్ళు ఉండే నదిలో పడిపోతారు. మరి వీళ్ళు ఆ మొసళ్ళ నుంచి తప్పించుకొని బయటపడ్డారా? హీరోయిన్ భర్త బతికాడా లేదంటే ప్రియుడు బ్రతికాడా? చివరికి ఏం జరిగింది అనే విషయం తెలియాలంటే ఫిర్ ఆయి హసీన్ దిల్ దుబా అనే ఈ సినిమాను చూడాల్సిందే.