OTT Movie : మనం ప్రకృతిని కాపాడుకుంటే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. లేదంటే ఆ ప్రకృతి విళయతాండవం చేసి అంతా సర్వనాశనం చేస్తుంది. ప్రస్తుతం వరదలు వచ్చి తెలుగు రాష్ట్రాలు ఎలా అల్లకల్లోలం అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ టైంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ బెటర్ ఛాయిస్ అని చెప్పవచ్చు. టైటిల్ చదవడానికి హారర్ మూవీలా లేదంటే బోల్డ్ మూవీలా అని అనిపించినప్పటికీ ఇది ఆ టైప్ మూవీ మాత్రం కాదు. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీని ఎక్కడ చూడొచ్చు? ఆ మూవీ పేరేంటి? అనే విషయాలపై లుక్కేద్దాం పదండి.
జీ5లో అందుబాటులో…
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సినిమా నిలవడానికి కాస్త నీడ ఉంటే చాలు అని తహతలాడే వ్యక్తి గురించి ఉంటుంది. అయితే డైరెక్టర్ ఈ స్టోరీ గురించి చెప్పిన విధానం మాత్రం కాస్త కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. టైటిల్స్ పడుతున్నాయి కదా అని ఇంట్రడక్షన్ ని స్కిప్ చేశారంటే సినిమాను అర్థం చేసుకోవడం కష్టం. సినిమా మొత్తం బోల్డ్ మూవీని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ఇది సినిమా కాదు సిరీస్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది మనోరతంగల్ అనే మాలీవుడ్ వెబ్ సిరీస్ గురించి. అందులో ఉన్న ఎనిమిదవ ఎపిసోడ్ ఈరోజు మన మూవీ సజెషన్. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ ఏంటంటే…
ముందుగా ఓ పెద్దాయన పడవలో ఓ ఊర్లో అడుగు పెడతాడు. ఆ తర్వాత ఊరికి దూరంగా ఉన్న ఓ పాడబడ్డ ఇంటిని అద్దెకు తీసుకుంటాడు. ఇక ఆ ఇంట్లోకి వెళ్లాక ఊర్లో ఎవరికీ కనిపించని అందమైన అమ్మాయి అతనికి మాత్రమే కనిపిస్తుంది. ఆమె ఎర్రని గాజులు వేసుకుని చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఉండడానికి కాస్త చోటు ఉంటే చాలు అనుకునే ఆ వ్యక్తి ఆ అమ్మాయిని చూసి తెగ సంతోషపడతాడు. అతను ఎక్కడికి వెళ్ళినా ఆమె తప్పకుండా కన్పిస్తుంది. అలాగే చుట్టుపక్కల వాళ్ళతోను బాగానే కలిసిపోతాడు. అతని దగ్గర కావలసినంత డబ్బు కూడా ఉంటుంది. ఇక ఒకానొక రోజు ఇంటి ఓనర్ ఆ ఇంటిని ఖాళీ చేయమని మనిషిని పంపుతాడు. తను వెళ్ళనని మొండికేస్తాడు. దీంతో వర్షాలు పడితే ఆ ఇల్లు కూలిపోతుందని ఓ వ్యక్తి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా వినకపోవడంతో మనుషులు పెట్టి సామాన్లను బయట పారేస్తారు. కానీ ఈ మొండిఘటం వింటే కదా. మొత్తానికి ఎలాగైనా సరే తనను ఆ ఇంట్లో నుంచి పంపించేస్తారు అని తెలుసుకున్న ఆ వ్యక్తి డీలా పడిపోయి నిద్రలోనే వింత వింతగా ప్రవర్తిస్తాడు. అసలు అతనికి కనిపించే ఆ అందమైన అమ్మాయి ఎవరు? ఎందుకు ఇతనికి మాత్రమే కనిపిస్తోంది? ఆ అపరిచితుడు ఎందుకు ఆ పాడుబడ్డ ఇంటిని కూలిపోయినా సరే వదలనని మొండికేస్తున్నాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ ఎపిసోడ్ పై ఒక లుక్కెయ్యండి.