OTT Movie : భర్తను చీట్ చేస్తున్నారా? ఈ మూవీ చూశారంటే ఆ ఆలోచనకు కూడా వణికిపోతారు

OTT Movie : ఇటీవల కాలంలో చీటింగ్ అనే మాటను ఎక్కువగా వినాల్సి వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరి మధ్య మూడో వ్యక్తి దూరడం, లేదా ఇంట్లో ఉన్న సమస్యల వల్ల భార్య లేదా భర్త మరో వ్యక్తిపై ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఇలాంటి విషయాలు ఫ్యామిలీలో చిచ్చు పెడుతున్నాయి. ఇక చీటింగ్ కంటెంట్ తో వస్తున్న సినిమాల సంఖ్యకు కూడా కొదవలేదు. ఓటిటిలో ఈ క్యాటగిరీలో ఎన్నో వెబ్ సిరీస్ లు, సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో ఓ మంచి మూవీని ఈరోజు మూవీ సజెషన్ లో చూడబోతున్నాము. మరి ఆ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు ఓటిటిల్లో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ఒకటి నెట్ ఫ్లిక్స్ కాగా, రెండోది అమెజాన్ ప్రైమ్ వీడియో. అయితే నెట్ ఫ్లిక్స్ లో సబ్స్క్రిప్షన్ మాత్రం ఉంటే సరిపోతుంది. కానీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రం రెంట్ బేసిస్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇక ఈ మూవీ పేరు నాక్టర్నల్ యానిమల్స్. మూవీ స్టోరీ లైన్ ఏంటంటే ఎంత చెప్పినా వినకుండా ఓ భార్య భర్తని చీట్ చేస్తుంది. తర్వాత ఆ విషయం తెలిసిన భర్త ఏకంగా తన భార్య గురించి బుక్ రాసి పగ తీర్చుకుంటాడు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

Nocturnal Animals Review (2016) | Full Analysis and Ending Explained

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఓ భర్తకు తన భార్య మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. కానీ ఆమె మాత్రం అతన్ని చీట్ చేస్తుంది. అతనికి ఈ విషయం తెలీదులే అని లైట్ తీసుకుంటుంది. అంతేకాదు నిజానికి ఇలాంటి తప్పులు ఎక్కువ రోజులు సీక్రెట్ గా ఉండవు కదా అనే విషయాన్ని మర్చిపోతుంది. అసలు విషయం బయట పడటంతో ఎంతగానో ప్రేమించిన భార్య తనను మోసం చేసిందని బాధతో అతను ఆమెను వదిలేస్తాడు. కానీ ఎవరైనా నమ్మి మోసపోతే అంత ఈజీగా ఎలా మర్చిపోగలరు. అతను కూడా అంతే ఆమె చేసిన మోసాన్ని తట్టుకోలేక పోతాడు. ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు.

భార్య చేసిన పనిపై ఏకంగా ఓ బుక్ రాసి పగ తీర్చేసుకుంటాడు. బుక్ రాస్తే పగ ఎలా తీరుతుంది అనుకుంటున్నారా? ఎలాగంటే ఆ బుక్ లో ఆమె తనను ఎలా మోసం చేసింది? తన భార్యను అతను ఎంతగా ప్రేమించాడు? ఇలా వాళ్ళ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని బుక్ లో వివరంగా రాస్తాడు. దీంతో ఇతరులు ఈ బుక్ చదువుతారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఆ భార్య చదివి తాను ఎలాంటి తప్పు చేసిందో తెలుసుకుని బాధతో కుంగిపోవాలి అన్నదే అతని ఆలోచన. మరి అతను అనుకున్నట్టుగా జరిగిందా ? ఆ బుక్ చదివాక భార్య ఎలా రియాక్ట్ అయ్యింది? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీ ని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు