OTT Movie : భార్యా భర్తల బంధానికి పునాది నమ్మకం. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే బంధం కూడా అంతే బలంగా ఉంటుంది. కానీ కొంతమంది బుద్ధి గడ్డి తిని పెడదారి పడతారు. మహాలక్ష్మి లాంటి భార్యను వదిలేసి, ఇతర అమ్మాయిల మాయలో పడిపోతారు. తీరా కళ్ళు తెరుచుకునే సరికి అంతా అయిపోతుంది. కానీ కొన్నిసార్లు అదృష్టం బాగుండి ఇదంతా జరగకుండా సరిగ్గా టైంకు బుద్ధి వచ్చేలా చేస్తుంది విధి. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా ఇలాంటిదే. మరి ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? పక్కదారి పట్టిన ఆ భర్తను భార్య ఎలా దారిలో పెట్టింది? అనే విషయాలను చూసేద్దాం పదండి.
జీ 5లో స్ట్రీమింగ్…
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ జీ5లో అందుబాటులో ఉంది. అయితే నిజానికి ఇది మూవీ కాదు ఒక మలయాళం వెబ్ సిరీస్. అందులో ఉన్న కొన్ని ఎపిసోడ్లు చూస్తే అసలు ఎందుకు చూస్తున్నామో కూడా అర్థం కాదు. కానీ కొన్ని ఎపిసోడ్లు మాత్రం బాగున్నాయి. అందులో ఇదొకటి. అయితే ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో స్టోరీని చూపించారు మేకర్స్. కాబట్టి ఈ ఎపిసోడ్ చూడాలి అనుకుంటే ముందున్న 6 ఎపిసోడ్లు చూడాలి కదా అన్న అనుమానమే అక్కర్లేదు.
స్టోరీ ఏంటంటే…
హీరోయిన్ ఇందులో ప్రెగ్నెంట్ గా ఉంటుంది. ఆల్రెడీ ఆమెకి ఒక కూతురు కూడా ఉంటుంది. గర్భిణీ అయినప్పటికీ ఓవైపు కూతురిని మరోవైపు ఇంటి పనులని, ఆపైన తమ పొలాలకు సంబంధించిన పనులను ఒక్కతే చూసుకుంటుంది. భర్త పని అని చెప్పి బయటకెళ్ళి ప్రియురాలితో ఎంజాయ్ చేస్తాడు. కనీసం భార్య ప్రెగ్నెంట్ గా ఉంది చూసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తాడు. పైగా అనాథగా ఉన్న అతనికి హీరోయిన్ తండ్రి పిల్లనిచ్చి కొత్త జీవితాన్ని కూడా ఇస్తాడు. ఆ ఇంట్లో కుక్కకు ఉన్న విశ్వాసం కూడా అతనికి ఉండదు. ఆమె మాత్రం వెయ్యి కళ్లతో భర్త ఇంటికి వస్తాడని ఎదురుచూస్తుంది. ఇక ఆ తర్వాత ఒకరోజు ప్రియురాలికి నచ్చ చెప్పి భార్య దగ్గరికి వస్తాడు. కూతురుకి హెల్త్ బాలేదన్న విషయం తెలిసి కూడా ఆమె కోసం కనీసం మందులు తీసుకురాడు. ఇక వచ్చి ఇంట్లో రెండు రోజులు ఉండగానే ప్రియురాలు గుర్తొచ్చి లాయర్ ను కలవాలి అనే సాకుతో భార్యతో చెప్పి ఆమెను చూడడానికి వెళ్తాడు. తీరా అక్కడికెళ్తే ఆమె చర్చ్ లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కనిపిస్తుంది. ఆ తర్వాత తన భర్తకి ఫ్రెండ్ అంటూ ప్రియుడిని పరిచయం చేస్తుంది. ఈ మోసాన్ని తట్టుకోలేక హీరో వెంటనే ఊరికి బయలుదేరుతాడు. మరి హీరోకి ఎలా బుద్ధి వచ్చింది? ఈ విషయం తెలిసిన హీరోయిన్ ఏం చేసింది? చివరికి ఈ భార్యాభర్తల బంధం నిలిచిందా లేదా? అని ప్రశ్నలకు సమాధానం కావాలంటే జి5 లో స్ట్రిమింగ్ అవుతున్న మనోరతంగల్ అనే సిరీస్ లో7వ ఎపిసోడ్ ను చూడాల్సిందే.