OTT Movie: పెళ్లికి ముందే మరొకటితో భార్య ప్రేమాయణం… భర్తను దూరం పెడుతూ…

OTT Movie: ఓటిటిలో మంచి మూవీని చూసాము అని ఫీలింగ్ కలిగే సినిమాలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. అయితే అలాంటి కొన్ని సినిమాలు అండర్రేటెడ్ కారణంగా పెద్దగా ప్రేక్షకులు దృష్టికి రావని చెప్పాలి. ఎప్పుడో ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలను చూసి ఆ సినిమాల గురించి వెతుక్కుంటూ ఓటిటిలోకి వెళ్తాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. అయితే ఈ మూవీ భార్యాభర్తల సమస్య గురించి ఉంటుంది. ఓ మంచి సినిమాను మిస్ అయ్యాము అనే ఫీలింగ్ కలగొద్దు అంటే ఈ మూవీపై ఓ లుక్కెయ్యండి. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలపై లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్…

సాధారణంగా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ, పెళ్లి చేసుకుంటే గతాన్ని మరిచి ఫ్యూచర్ పై దృష్టి పెడతారు చాలామంది. కానీ అతి కొద్ది మంది మాత్రమే ఇంకా గతంలోనే బ్రతుకుతూ ఉంటారు. దానికోసం వాళ్లు ఇబ్బంది పడడమే కాకుండా పెళ్లి చేసుకున్న అవతలి వ్యక్తిని కూడా ఇబ్బంది పెడతారు. మనం చెప్పుకోబోయే మూవీ కూడా దాదాపుగా ఇలాంటిదే. పెళ్లికి ముందే వేరొకరితో ప్రేమాయణం నడిపించిన హీరోయిన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అయితే భర్తను దూరంగా పెడుతూ ఆ ఒక్కటి అడగొద్దు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. ఈ మూవీ పేరు మలై నేరతు మాయకం. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Selvaraghavan's 'Maalai Naeruthu Mayakkam'! | A Writer's Notebook.

- Advertisement -

కథలోకి వెళ్తే…

హీరోయిన్ తండ్రి చనిపోవడంతో క్యాన్సర్ బారిన పడ్డ తల్లితోనే క్లోజ్ గా ఉంటూ, ఆమెను జాగ్రత్తగా చూసుకుంటుంది. కట్ చేస్తే గతంలో 26 ఏళ్ల హీరోకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండదు. అతనికి ఎలా మాట్లాడాలో తెలియకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తుంది. మరోవైపు హీరోయిన్ ఓ వ్యక్తిని లవ్ చేస్తుంది. కానీ అతనేమో హీరోయిన్ ను ప్రేమ పేరుతో కేవలం ఫిజికల్ గా వాడుకుంటాడు. దీంతో విషయం తెలిసిన హీరోయిన్ అతనికి బ్రేకప్ చెప్పి, డిప్రెషన్ లోకి వెళ్లి పోతుంది. కానీ క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లి ఆమెకు నచ్చజెప్పి వేరొకరితో పెళ్లి చేస్తుంది. ఆ తర్వాత హీరోతో హీరోయిన్ కి అరేంజ్డ్ మ్యారేజ్ జరిగిపోతుంది. కానీ పెళ్లి తర్వాత హీరోయిన్ భర్తతో అస్సలు మాట్లాడదు, పైగా అతనికి దూరంగా ఉంటుంది. వారిద్దరి మధ్య గొడవలు వస్తాయి. హీరో ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎంత ట్రై చేసినా హీరోయిన్ మాత్రం ఉలకదు పలకదు. ఓ రోజు భార్య భర్తలు ఇద్దరూ బయటకి వెళ్ళగా హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతాడు. దీంతో అసలు విషయం హీరోకు అర్థమవుతుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు నెమ్మదిగా ప్రేమను పడతారు. కానీ అతని ఫిజికల్ గా మాత్రం అసలు దగ్గరకు రానివ్వదు. మరి ఇంతకీ హీరోయిన్ ఎందుకలా ప్రవర్తిస్తుంది? చివరికి ఈ భార్యాభర్తలిద్దరూ కలిసారా లేదా? వంటి విషయాలు తెలియాలంటే ఈ మూవీని తెరపై చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు