OTT Movie : పక్కింట్లోకి బైనాక్యులర్ తో తొంగిచూసే అమ్మాయి… క్రేజీ బో*ల్డ్ మూవీ

OTT Movie : ఓటీటిలో ఎన్నో క్రేజీ థ్రిల్లర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే మూవీ లవర్స్ ని సీట్ ఎడ్జ్ నా కూర్చోబెట్టే కథాంశంతో నడుస్తాయి. అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న థ్రిల్లర్ సినిమాలను చూస్తే ఎన్ని రోజులైనా అది మైండ్ లో నుంచి పోదు. ఈరోజు థ్రిల్లర్ మూవీ లవర్స్ కోసం అలాంటి ఒక క్రేజీ మూవీని తీసుకొచ్చాం. ఇందులో ఉండే స్టోరీ తో పాటు గ్రిప్పింగ్ నరేషన్, ట్విస్టులు కచ్చితంగా పిచ్చెక్కిస్తాయి. పైగా బో*ల్డ్ కంటెంట్ కూడా ఉంటుంది. మరి ఈ మూవీ పేరేంటి ? ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…

ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం అనేది కొంత మందికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరికొంత మందికైతే అదొక వీక్నెస్ అని చెప్పొచ్చు. ఈ అలవాటును ఎంత మానుకుందామన్నా మానుకోలేరు. అలా పక్క వాళ్ళ జీవితాల్లో తొంగి చూడడం, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఆలోచనతో వాళ్లపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచడం వంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తమ కంటే అవతలి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ తెలుసుకుంటూ ఉంటారు. ఇది బాడ్ హ్యాబిట్ అయినప్పటికీ అలాగే కంటిన్యూ చేస్తారు. కానీ ఇలాంటి అలవాటు వల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి అనే స్టోరీ తోనే ఈ సీరీస్ రూపొందింది. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Lady Voyeur (TV Mini Series 2023) - IMDb

- Advertisement -

స్టోరీ లోకి వెళ్తే…

ఇందులో హీరోయిన్ ఏకంగా బైనాక్యులర్స్ తీసుకుని అవతలి అపార్ట్మెంట్లో ఉండే అన్ని ఫ్లాట్స్ లో ఏం జరుగుతుందో తొంగి చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా సీసీ కెమెరాల ద్వారా అందరిని ఫాలో అవుతుంది. కొన్ని రోజుల వరకు ఇదొక మంచి ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతుంది. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలుసుకుంటుంది. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో చెప్పుకోలేని రహస్యాలు ఎన్నో ఉంటాయి. పైకి సంతోషంగా, అందంగా కనిపించినప్పటికీ ప్రతి ఒక్కరి జీవితంలో డార్క్ సైడ్ అనేది ఉంటుంది. ఇక హీరోయిన్ కొంతమంది జీవితాలకు సంబంధించి మరీ ఎక్కువగా తెలుసుకోవాలని అనుకుంటుంది. దీంతో ఆమెకు కష్టాలు మొదలవుతాయి. తనకు తెలియకుండానే అవతలి వాళ్ళ జీవితంలో వేలు పెట్టడం ఆమెను చిక్కుల్లోకి నెట్టేస్తుంది. అసలు హీరోయిన్ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? దీని వల్ల ఆమె ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది? ఆమె ఆ ప్రమాదాల నుంచి ఎలా బయటపడింది? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు ఆన్సర్ కావాలంటే లేడీ ఓయర్ అనే ఈ సిరీస్ ను చూసి తీరాల్సిందే. అయితే ఈ సిరీస్ బోల్డ్ గా ఉంటుందని మర్చిపోవద్దు. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో పాటు మసాలా కంటెంట్ కూడా ఉంటుని కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడగలిగే మూవీ కాదు ఇది అని గుర్తు పెట్టుకోండి. థ్రిల్లర్ మూవీ లవర్స్ కు ఈ లేడీ ఓయర్ మూవీ ఒక మంచి ఫీస్ట్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు