OTT Movie : ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ ట్రెండ్ కొరియన్ సినిమాలు, సిరీస్ లు. అసలు ఈ కొరియన్ డ్రామాలకు ఎంతగా అడిక్ట్ అయ్యారంటే.. ఏ ఓటీటీలో ఉన్నా సరే ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో అభిమాననులు ఉన్నారు. అసలు వీళ్ళ సినిమాలు లేదా సిరీస్ లు ఎంత గ్రిప్పింగ్ గా ఉంటాయంటే ఒక్కసారి చూడడం మొదలు పెడితే కంప్లీట్ అయ్యేదాకా దాన్ని ఆపడం మన తరం కాదు. అందుకే భాష రాకపోతే డబ్బింగ్ వెర్షన్ కోసం వెతుకుతారు. అది కూడా అందుబాటులో లేకపోతే సబ్ టైటిల్స్ తో లాక్కొచ్చేస్తారు. ఇక ఈరోజు కూడా మన మూవీ సజేషన్ అలాంటిదే. ముఖ్యంగా కొరియన్ సినిమాలను పిచ్చిగా ఇష్టపడే వారికి పండగే. 200 ఏళ్ల వయసున్న దెయ్యం అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్నది స్టోరీ. మరి ఈ క్రేజీ లవ్ స్టోరీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? సినిమా పేరెంటి అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది మూవీ స్టోరి కాదు వెబ్ సిరీస్. ఈ హారర్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ మొత్తం 16 ఎపిసోడ్లతో నడుస్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఒకవేళ ఇప్పటిదాకా ఎవరైనా చూడకపోతే డోంట్ మిస్. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఇది.
కథ విషయానికి వస్తే..
సినిమాలో హీరోయిన్ ఓ కంపెనీకి బాస్. వయసొచ్చినా పెళ్లి, బాయ్ ఫ్రెండ్ ల గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా కంపెనీని బాధ్యతగా నడిపిస్తుంది. జల్సాలు లాంటి ఇతర విషయాలను పట్టించుకోకుండా మొత్తం కంపెనీ పనులపై దృష్టి పెడుతుంది. ఈ అమ్మాయి లైఫ్ లోకే హీరో ఎంట్రీ ఇస్తాడు. అతనే 200 ఏళ్ల వయసున్న దెయ్యం. ఈ దెయ్యం హీరో హీరోయిన్ కంపెనీలో ఉద్యోగిగా చేరి మెల్లగా ఆమెకు దగ్గరవుతాడు. హీరోయిన్ కూడా అబ్బాయి స్మార్ట్ గా, హ్యాండ్సమ్ గా ఉండడంతో అట్రాక్ట్ అవుతుంది. కంపెనీలోనే ఉండి బాస్ తో సీక్రెట్ గా లవ్ స్టోరీని నడిపిస్తాడు హీరో. అయితే అతనొక దెయ్యం అన్న విషయంలో ఆమెకు తెలియదు. వీళ్ళ పరిచయం వింతగా జరుగుతుంది. నీళ్ళలో మునిగిపోతున్న అతన్ని హీరోయిన్ కాపాడుతుంది. అయితే అదే టైమ్ లో హీరోకి ఉన్న పవర్స్ హీరోయిన్ కి ట్రాన్స్ ఫర్ అవుతాయి. ఆ తరువాతే హీరో, హీరోయిన్ దగ్గరవుతారు. మొత్తానికి శక్తులు అన్నీ పోయి సాధారణ మనిషిలా మారిన అతను ఎలాగైనా సరే హీరోయిన్ దగ్గర నుంచి తన పవర్స్ ను తిరిగి పొందడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. మొత్తానికి ఒకరోజు తన గురించి అసలు విషయాన్ని హీరోయిన్ కు చెప్పేస్తాడు. మరి ఆ తరువాత ఏం జరిగింది? ఈ జంట ఒక్కటయ్యిందా లేదా? హీరోకి తన పవర్స్ తిరిగి వచ్చాయా? అనే విషయాలు తెలియాలంటే మై డీమన్ అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే.