OTT Movie : ప్రాణంగా ప్రేమించే అమ్మాయి స్నేహితుడితో కలిసి మోసం చేస్తే… హీరో రివేంజ్ నెక్స్ట్ లెవెల్ భయ్యా

OTT Movie : ఎమోషనల్ రివేంజ్ డ్రామాలు చూస్తూ ఉంటే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా లవ్ స్టోరీ, రొమాంటిక్ సినిమాలలో గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా వంటి సన్నివేశాలు ఉంటే ఆ సినిమా అదిరిపోతుంది. ఫిదా అయ్యే లవ్ స్టోరీ, రివెంజ్, గ్యాంగ్ స్టర్, యాక్షన్ ఇలాంటి అంశాలన్నింటినీ మిలితం చేసిన సినిమాలను ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి అని విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మూవీలో హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ నటిస్తున్నాడు అంటే కచ్చితంగా కంటెంట్ ఉండే మూవీనే అవుతుంది అని నమ్మకాన్ని కలిగించాడు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మూవీ పేరు కింగ్ ఆఫ్ కోత. కొత్త అంటే మలయాళంలో ఊరు లేదా పట్టణం అని అర్థం వస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

King of Kotha

- Advertisement -

కథ ఏంటంటే…

కోత అనే టౌన్ లో హీరో రాజు తన తండ్రిలాగే ఓ పెద్ద రౌడీ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటాడు. అనుకోవడమే కాదు పెద్దయ్యాక కోత టౌన్ ను తన గుప్పిట్లోకి తెచ్చుకుని నిజంగానే రాజులా బ్రతుకుతాడు. అయితే కొడుకు రౌడీ కావడంతో తల్లి అతనితో మాట్లాడదు. కానీ అతనికి చెల్లి రీతు అంటే ప్రాణం. తల్లికి ఇష్టం లేకపోవడంతో వాళ్ళిద్దరికీ దూరంగా కోత టౌన్ లోనే ఉన్న తన స్నేహితుడు కన్నా దగ్గర ఉంటాడు. అలాగే రాజు టీం మొత్తం ఫుట్బాల్ బాగా ఆడతారు. ముఖ్యంగా రాజు మంచి ఫుడ్ బాల్ ప్లేయర్. ఆ చుట్టుపక్కల ఎక్కడ పోటీలు నిర్వహించినా ఈ గ్యాంగ్ ఉండి తీరాల్సిందే. ఇక అదే ప్రాంతంలో ఉండే ఐశ్వర్యపై రాజు మనసు పడతాడు. అంతేకాకుండా ఆమె కోసం తమ ఏరియాలో డ్రగ్స్ అనే మాట లేకుండా చేస్తాడు.

కానీ సడన్ గా రాజు తాగుబోతుగా మారుతాడు. ఆ తర్వాత గ్యాంగ్ అంతా సపరేట్ అయిపోతుంది. కొంతకాలం తర్వాత కన్నా ఆ ఏరియాను తన చేతుల్లోకి తీసుకుని డ్రగ్స్ ను విచ్చలవిడిగా అమ్ముతూ కన్నా భాయ్ గా చలామణి అవుతాడు. దీంతో పోలీసులు కన్నా బాయ్ కి భయపడి అతన్ని మట్టు పెట్టాలని ఆర్డర్స్ తో ఓ సిఐని కోతకి పంపిస్తారు. అయితే సిఐ వీడి భరతం పట్టాలంటే రాజునే కరెక్ట్ అని చాలాకాలం కనిపించకుండా పోయిన అతన్ని వెతికి పట్టుకొని, మళ్లీ రంగంలోకి దింపుతాడు. అయితే అసలు రాజు ప్రేమించిన అమ్మాయిని, తన తల్లి చెల్లిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎవరికి చెప్పకుండా ఎందుకలా వెళ్లాడు? ప్రాణ స్నేహితులైన కన్నా, రాజు ఎందుకు శత్రువులుగా మారారు? అనే విషయాలు తెలియాలంటే కింగ్ ఆఫ్ కోత మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు