OTT Movie : ఎన్ని సినిమాలు వచ్చినా మా హీరో సినిమాను మాత్రమే చూస్తాము అనే రోజులు పోయాయి ఇప్పుడు. కంటెంట్ బాగుంటే చాలు సినిమాలో హీరో లేకపోయినా సరే ఆడుతున్నాయి అంటేనే పరిస్థితి ఎంతగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఓటీటీల పుణ్యమా అని లాంగ్వేజ్ బారియర్ అనేది లేకుండా అన్ని భాషల సినిమాలను, సిరీస్ లను చూసి ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో తెలుగు సినిమాల స్పాన్ ఫ్యాన్ ఇండియా రేంజ్ కి ఎదిగితే, మలయాళ సినిమాల పిచ్చి తెలుగు ప్రేక్షకులకు పట్టుకుంది. మలయాళ ఇండస్ట్రి నుంచి ఏ మూవీ రిలీజ్ అయినా సరే మిస్ అవ్వట్లేదు. ముఖ్యంగా ఫాహద్ ఫాజిల్ కు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తెలుగులో పుష్ప సినిమా తర్వాత ఈ మాలివుడ్ హీరోకు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ బేస్ పెరిగింది. సాధారణంగానే మలయాళ సినిమాలను ఇష్టపడే తెలుగు మూవీ లవర్స్ ఫాహద్ ఫాజిల్ నుంచి ఏ సినిమా వచ్చినా సరే అసలు వదలట్లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన నటించిన మిస్టరీ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. మరి ఆ మూవీ ఏంటి ? ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మూడేళ్ల తర్వాత నేరుగా ఓటీటీలోకి…
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మలయాళ సినిమా థియేటర్లలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి అడుగు పెట్టబోతుండడం విశేషం. అది కూడా తమిళంలో మాత్రమే. తమిళంలో డబ్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించగా, ఆయన సరసన హీరోయిన్ గా దర్శన రాజేంద్రన్ కనిపించింది. ఇక నసీఫ్ యూసఫ్ నవాజుద్దీన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, తాజాగా పాపులర్ ఓటిటి ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ సినిమా పేరు ఇరుల్. సెప్టెంబర్ 6 నుంచి తమిళంలో రిలీజ్ కాబోతోంది. అయితే తెలుగు వర్షన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతోంది అనే విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
స్టోరీ ఏంటంటే…
రైటర్ అలెక్స్ తన గర్ల్ ఫ్రెండ్ అర్చనతో కలిసి ట్రిప్ కి వెళ్తాడు. కారులో ఇద్దరూ కలిసి కొంత దూరం ప్రయాణం చేశాక అసలు సమస్య మొదలవుతుంది. సడన్ గా అడవిలోకి చేరుకోగానే నడిరోడ్డులో కారు ఆగిపోతుంది దీంతో దగ్గర్లోనే ఉన్న ఇంటికి వెళ్తారు ఆ ఇంటికి ఓనర్ అని పరిచయం చేసుకుంటాడు ఫాహద్ ఫాజిల్. తీరా అక్కడికి వెళ్ళాక ఆ కపుల్ కి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. అసలు ఆ ఇంటి ఓనర్ ఎవరు? ఫాహద్ ఫాజిల్ అక్కడ ఎందుకు ఉన్నాడు? ఈ పరిస్థితుల నుంచి ఆ కపుల్ తప్పించుకోగలిగారా ? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? అనే విషయాలు తెలియాలంటే ఈ ఇరుల్ సినిమా చూడాల్సిందే.