OTT Movie : యానిమేషన్ సినిమాలు అనగానే అవి పిల్లలకు మాత్రమే అనుకుంటారు కొంతమంది. కానీ ప్రస్తుతం వస్తున్న యానిమేటెడ్ మూవీస్ అన్నీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూసేలా ఉంటున్నాయి. పైగా ఆలోచనలను రేకెత్తించే విధంగా ఉంటున్నాయి. సోషల్ మెసేజ్ ఉన్న కొన్ని సినిమాలను చూడాలంటే బోర్ కొడుతుంది. కానీ యానిమేటెడ్ సినిమాలను చూస్తే మాత్రం అదో కొత్త లోకంలో ఉన్నట్టుగా ఉండడంతో పాటు మేకర్స్ ఇచ్చే సోషల్ మెసేజ్ కూడా తలకెక్కుతుంది. ఇక ప్రతి వారం ఓటీడీలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుండగా అందులోను కొన్ని యానిమేటెడ్ సినిమాలు ఉంటాయి. సస్పెన్స్, కామెడీ, హర్రర్, రొమాంటిక్ సినిమాలను చూసి బోర్ కొట్టినప్పుడు ఇలాంటి సినిమాలు చూస్తే మనసుకు ఒక మంచి సినిమాను చూస్తామన్న ఫీలింగ్ కలుగుతుంది. అలా ఒక మంచి యానిమేటెడ్ మూవీ కోసం వెతుకుతున్న వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఈ మూవీ పాపులర్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. మరి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? కథ ఏంటి? అని వివరాల్లోకి వెళ్తే…
హాట్ స్టార్ లో అందుబాటులో…
మీరు గనక యానిమేషన్ మూవీ లవర్స్ అయితే కచ్చితంగా ఈ మూవీ మనసును కదిలించే విధంగా ఉంటుందనీ ఫిక్స్ అయిపోండి. పైగా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడగలిగే మూవీ. రన్ టైమ్ కూడా తక్కువే. పైగా ఈ మూవీ సీక్వెల్ రీసెంట్ గా రిలీజ్ అయి థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక పిల్లలున్న తల్లిదండ్రులు మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ ఇది. ప్రస్తుతం ఈ యానిమేషన్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళ్తే…
సినిమా మొత్తం రైలి అనే ఒక 11 ఏళ్ల చిన్న పాప చుట్టూ తిరుగుతుంది. ఆమె తన కుటుంబంతో కలిసి మినీసోటా అని నగరంలో నివసిస్తుంది. తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా గడుపుతున్న ఆ పాపకి ఓ రోజు షాక్ అయ్యే న్యూస్ చెప్తారు పేరెంట్స్. ప్రస్తుతం తాము నివసిస్తున్న ప్రదేశం నుంచి సాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాలని డిసైడ్ అవుతారు. అయితే వాళ్లకు ఇది సర్దుకుపోయే విషయమే అయినప్పటికీ రైలీకి మాత్రం జీర్ణించుకోలేని విషయం అవుతుంది. ఆ విషయం గురించి ఆలోచించడమే ఆమె జీవితాన్ని తారుమారు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రాంతాన్ని వదిలేసి కొత్త సిటీకి, కొత్త మనుషులు, కొత్త స్కూల్ కి వెళ్లాలి అనే విషయం ఆమెలో భయాన్ని, కోపాన్ని, అసహనాన్ని రెట్టింపు చేస్తాయి. మరి ఇంతకీ రైలీ బాధను ఆమె తల్లిదండ్రులు అర్థం చేసుకోగలిగారా లేదా? చివరికి స్టొరీ ఎలాంటి మలుపు తిరిగింది? అనే విషయాలు తెలియాలంటే ప్రస్తుతం హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఇన్సైడ్ అవుట్ అనే సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయింది. ఫస్ట్ పార్ట్ హాట్స్టార్ లో ఉంది. సెకండ్ పార్ట్ మాత్రం ఇంకా ఓటీటీలో రిలీజ్ కాలేదు.