OTT Movie : సినిమా ఆఫర్ రావాలంటే ఆ పని చేయాల్సిందే… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయట పెట్టే మూవీ

OTT Movie : కాస్టింగ్ కౌచ్ అనే పదం ఇప్పుడు అందరికీ బాగా తెలుసు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలన్నా, అక్కడ నిలదొక్కుకోవాలి అన్నా కూడా కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికే చాలా మంది ప్రముఖ హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఈ పరిస్థితి కేవలం మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాదు ఇండియన్ సినిమా నుంచి మొదలు పెడితే హాలీవుడ్ వరకు సేమ్ సిచువేషన్ నడుస్తోంది. నిజానికి హాలీవుడ్ లో మీటూ అంటూ ఈ విషయం గురించి తీవ్ర దుమారం రేగిన తర్వాతే అది టాలీవుడ్ కి సోకింది. ఇక ఈ వివాదంలో సౌత్ లోని ఎంతో మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే ఈ రోజు అలాంటి ఓ మూవీ సజెషన్ నే మీకోసం తీసుకొచ్చాం. అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అనే విషయం తెలియాలంటే ఈ మూవీనీ చూసి తీరాల్సిందే. మరి ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

చూసేటప్పుడు జాగ్రత్త

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ బో*ల్డ్ జానర్ లో ఉంటుంది. మీరు గనక ఈ జానర్ లోనే సినిమాలను వెతికితే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ సినిమా బో*ల్డ్ మాత్రమే కాదు చూడడానికి కథ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది సినిమా కాదు సిరీస్. ఈ సిరీస్ పేరు హాలీవుడ్. ఎందుకంటే హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఇందులో చూపించారు. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బో*ల్డ్ సన్నివేశాలు ఉంటాయి కాబట్టి ఒంటరిగా చూడడానికే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం స్టోరీ లోకి వెళ్దాం.

Ryan Murphy's Netflix Series 'Hollywood' Celebrates History Tarantino-Style - Hollywood Insider

- Advertisement -

కథలోకి వెళ్తే…

రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయ్యాక చాలా మంది సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టాలి అని డిసైడ్ అవుతారు. సిల్వర్ స్క్రీన్ పై మెరవడానికి న్యూయార్క్ వెళ్తారు. అయితే బయట ఉన్నప్పుడు ఊహించింది ఒకటైతే అక్కడికి వెళ్ళాక జరిగే పరిస్థితులు మరోలా ఉంటాయి. సినిమాలో అవకాశం రావాలి అంటే కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే కొందరు తమ కలను నెరవేర్చుకోవడానికి కమిట్మెంట్ కు రెడీ అవుతారు.

అయితే అందులోను తెల్లవాళ్లు మాత్రమే స్టార్స్ అవుతారు. నల్ల వాళ్ళని పట్టించుకోకపోవడంతో వాళ్లకు అవకాశాలు కరువుతాయి. ఈ సినిమాలో కథ, బోల్డ్ నెస్ తో పాటు కావాల్సినంత ఎమోషన్ కూడా ఉంటుంది. ఈ సిరీస్ లో సినిమా ఇండస్ట్రీలోని పరిస్థితులు ఎలా ఉంటాయి? అవకాశాలు రావాలంటే ఎలాంటి పరిస్థితులను దాటుకొని రావాలి? కమిట్ అయితే ఏంటి? అవ్వకపోతే ఏంటి? అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మేకర్స్. కాబట్టి బో*ల్డ్ సిరీస్ తో పాటు సినిమా ఇండస్ట్రీలోని కాంప్రమైజ్ లాంటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ మూవీని చూసేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు