OTT Movie : కక్షలు పెంచే గుడి కోసం ప్రాణ స్నేహితుడినే చంపే హీరో… ఈ రివేంజ్ డ్రామా ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : ఇప్పటిదాకా ఓటిటీ ప్లాట్ ఫామ్ లో ఎన్నో రివేంజ్ డ్రామాలను చూసాము. అందులో తన సొంతవాళ్లను చంపిన శత్రువులను హీరో హతమార్చడం, ఎన్నేళ్లయినా పగతో రగిలిపోయే శత్రువులను హీరో మట్టు పెట్టడం వంటి రొటీన్ కథలను చాలానే చూసాము. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మాత్రం కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. ఈ మూవీలో ఏకంగా ఓ గుడి కోసం హీరోనే తన స్నేహితుడిని చంపేస్తాడు. మరి ఈ రివేంజ్ డ్రామా ఏ ఓటీటీలో ఉంది? అసలు స్టోరీ ఏంటి? అని వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

రివేంజ్ డ్రామా అన్నాము కాబట్టి ఈ సినిమాలో కేవలం రక్తపాతం మాత్రమే కాదు కంటతడి పెట్టించే ఎమోషనల్ సీన్లు, యాక్షన్ మూవీ లవర్స్ ఇష్టపడే ఫైట్ సీక్వెన్స్, అలాగే అదిరిపోయే స్టోరీ ఉన్నాయి. ఇక ఈ మూవీలో హీరోగా నటించింది ఒకప్పటి తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్రస్తుత హీరో సూరి. ఆర్ఎస్ దొరై సెంథిల్ కుమార్ సూరి మేకవర్ మొత్తాన్ని మార్చేసి, పర్ఫెక్ట్ యాక్షన్ స్టార్ గా ప్రేక్షకులకు చూపించాడు. ఆ మూవీ పేరే గరుడన్. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Garudan Movie (2024): Release Date, Cast, Ott, Review, Trailer, Story, Box  Office Collection – Filmibeat

- Advertisement -

కథలోకి వెళ్తే…

స్టోరీ మొత్తం ఒక గుడి చుట్టూనే తిరుగుతుంది. మంత్రి తంగపాండి తమిళనాడులోని కొంభై అనే ఊరిలో నివసిస్తాడు. అయితే ఈ వంకర బుద్ధి మంత్రి దేవాలయం కోసం కేటాయించిన స్థలాన్ని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ముత్తు వేల్ అనే ఇన్స్పెక్టర్ హెల్ప్ అడుగుతాడు. ఆ గుడిని చూసుకుంటున్న కర్ణ అనే వ్యక్తి బామ్మను చంపేస్తే ఆక్రమించుకోవడం ఈజీ అవుతుందని ప్లాన్ వేస్తాడు తన బావమరిది నాగరాజ్ తో కలిసి. సొక్కాన్, కర్ణ, ఆది అనే ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. ఓ రోజు హఠాత్తుగా గుడిని చూసుకునే బామ్మ చనిపోవడంతో హీరో స్నేహితుడైన కర్ణకు దేవాలయ బాధ్యతలు అప్పగించాలని ఊరు పెద్దలు అనుకుంటారు. కానీ నాగరాజు తానే చూసుకుంటానని గొడవ పడతాడు.

దీంతో అతనికి పోటీగా సొక్కాన్ నిలబడతాడు. ఎన్నికల్లో గెలిచి ఆ బాధ్యతలు కూడా తీసుకుంటాడు. కానీ ఈ విషయం సొక్కాన్ స్నేహితుడైన కర్ణ భార్యకు నచ్చదు. పైగా ఆర్థిక పరిస్థితి కారణంగా కుటుంబం కష్టాల్లో పడుతుంది. ఈ కష్టాలు చాలవన్నట్టు మరోవైపు గుడి నిర్వాహకుడిగా సొక్కాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుడికి సంబంధించిన నగలు నకిలీవని తేలుతుంది. ఆ తర్వాత ఆ దొంగతనం చేసింది తానేనని స్నేహితుడు కర్ణ ఒప్పుకోవడంతో అతనిని జైలుకు పంపిస్తాడు మరో స్నేహితుడు ఆది. కానీ నాగరాజు కర్ణకు బెయిల్ ఇప్పించి, బయటకు తీసుకురావడంతో ఇద్దరు ఒకటవుతారు. ఉత్సవాలు జరిగే సమయంలో ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు దొంగతనం చేయడానికి రెడీ అవుతారు. ఈ విషయం తెలిసిన సొక్కాన్ ఏం చేశాడు? పగతో రగిలిపోతున్న కర్ణ.. సొక్కాన్ ఆదిపై ఎలా పగ తీర్చుకున్నాడు? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు