OTT Movie : కొన్ని సినిమాల్లో ఉండే ట్విస్ట్ లు చూస్తే సినిమా అంటే ఇలా ఉండాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. అందులోనూ క్లైమాక్స్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. సినిమా మొత్తం ఎలా ఉన్నా సరే క్లైమాక్స్ కోసమైనా సరే ఈ మూవీని చూడాలి అనిపించేలా ఉంటాయి. వారెవ్వా అనిపించే ఇలాంటి థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడని వారెవరు. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా ఇలాంటిదే. ఇప్పటిదాకా మీరు గనక ఈ మూవీని చూసి ఉండకపోతే ఓ మంచి మిస్టరీ మూవీనీ మిస్ అయ్యారని అర్థం. మరి ఇలాంటి క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
జియో సినిమాలో స్ట్రీమింగ్…
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీలో ఒక అమ్మాయి కోసం ఇద్దరు కొట్టుకు చస్తారు. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇందులో విచిత్రం ఏమిటంటే ఆమె కోసం కొట్టుకు చచ్చిన వాళ్ళలో ఒకరు భర్త అయితే మరొకరు ప్రియుడు. ఇక భర్త వేరే అబ్బాయి తో ఎఫైర్ పెట్టుకున్నాడు అని తెలిసిన ఆ భర్త ఊహించని పని చేస్తాడు. దీంతో ఆమె ప్రియుడికి కోపం వచ్చి అతన్ని చావగొడతాడు. వీళ్ళిద్దరి గొడవలో న్యాయం చేయడానికి వస్తాడు హీరో. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ప్రస్తుతం జియో సినిమాలో అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే..
ముందుగా ఓ రిచ్ వ్యక్తి రిసార్ట్ లో ఉన్న ఇద్దరు కపుల్స్ ని ఫాలో అవుతాడు. పైగా వాళ్ళు ఉంటున్న రూమ్ లోకి వెళ్లి ఏదో వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడికి ఒక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. నిజానికి ఆ అమ్మాయి ఇతని భార్య. ఆమె తన ప్రియుడితో కలిసి భర్తకు తెలియకుండా ఆ రీసార్ట్ కు ఎంజాయ్ చేయడానికి వెళ్తుంది. ఇలా భార్య మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని తెలిసిన ఆ భర్త ఆమెను అక్కడికక్కడే కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత హత్య నింద తన మీద పడకుండా ఉండడానికి సాక్ష్యాధారాలను హైడ్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత సీన్లోకి చనిపోయిన అమ్మాయి ప్రియుడు ఎంట్రీ ఇస్తాడు. పోలీస్ ఆఫీసర్ అయిన అతను ఆ కేసు ఎవరిదో తెలియకుండానే ఇంటరాగేషన్ మొదలు పెడతాడు. తర్వాత ఆమె డెడ్ బాడీ ని చూసి తన గర్ల్ ఫ్రెండ్ అని తెలుసుకుని వెంటనే కోపంతో ఆమె భర్త పై దాడి చేస్తాడు. ఇక ఆ తర్వాత హీరోయిన్ ఇంకా బ్రతికే ఉందని గమనించి ఆమెను హాస్పిటల్ లో చేరుస్తారు. మరోవైపు ఆమె భర్తను అరెస్ట్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఈ కేసును హ్యాండిల్ చేయడానికి హీరో సీన్ లోకి అడుగు పెడతాడు. మరి హీరో వీరిద్దరిలో హీరో ఎవరికి సపోర్ట్ చేస్తాడు? అసలు ఎవరిది తప్పు? ఆ అమ్మాయి బతికిందా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఫ్రాక్చర్ అనే ఈ సినిమాను చూడాల్సిందే.