OTT Movie : యుద్ధభూమిలో ఫిదా చేసే లవ్ స్టోరీ… ప్రేమికులు మిస్ కాకుండా చూడాల్సిన కొరియన్ డ్రామా

OTT Movie : ఇటీవల కాలంలో కొరియన్ వెబ్ సిరీస్ లు, సినిమాలు అంటే చెవి కోసుకునే వారి సంఖ్య భారీగానే పెరిగింది. మినీ టీవీ, ఆహా వంటి ఓటీపీ ప్లాట్ ఫామ్ లలో పలు కొరియన్ సిరీస్ లు, సినిమాలు అందుబాటులో ఉండడంతో తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా వాటికి మంచి ఆదరణ దక్కుతోంది. సబ్ టైటిల్స్ ఉన్నా లేకపోయినా కంటెంట్ ఉంటేనే ఈ కొరియన్ డ్రామాలనైనా చూడగలం. అందుకే ఈ రోజు మూవీ సజెషన్లో ఓ మంచి లవ్ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ సిరీస్ ని చూశాక ప్రేమంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. మరి ఈ కొరియన్ డ్రామా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అసలు స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఆహలో స్ట్రీమింగ్…

తెలుగు ప్రేక్షకులకు కంప్లీట్ గా తెలుగు కంటెంట్ ను అందిస్తున్న ఒకే ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా. ఈ ఓటిటిలో మంచి తెలుగు సినిమాలు, సిరీస్ లతోపాటు పలు కొరియన్ డ్రామాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ కూడా ఒకటి. టైటిల్లో చెప్పినట్టుగానే యుద్దభూమిలో జరిగే లవ్ స్టోరీ ఇది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కసారి సిరీస్ చూడడం స్టార్ట్ చేస్తే చివరి ఎపిసోడ్ దాకా కనీసం పక్కకు కూడా జరగరు.

Watch Descendants of The Sun | Prime Video

- Advertisement -

స్టోరీలోకి వెళ్తే…

ఇందులో హీరో ఆర్మీ అధికారిగా కనిపిస్తాడు. హీరోయిన్ ఒక డాక్టర్. హీరో సెలవుల కారణంగా సిటీకి వచ్చి, కొంతమంది రౌడీ మూకలను కొడతాడు. ఈ ఫైట్ లో జరిగిన గాయాల కారణంగా అతను హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడే హీరో హీరోయిన్ కి మధ్య పరిచయం ఏర్పడుతుంది. వీళ్ళిద్దరూ డేటింగ్ స్టార్ట్ చేసే లోపే హీరోకి యుద్ధ రంగంలోకి దిగాలని ఆర్డర్స్ వస్తాయి. దీంతో హీరోయిన్ కి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హాస్పిటల్లో జరిగిన గొడవ కారణంగా హీరోయిన్ ని కావాలని యుద్ధభూమిలో సర్వీస్ చేసే డాక్టర్ గా పంపిస్తారు. ఆమెను పిక్ చేసుకోవడానికి హీరోనే వస్తాడు. కానీ ఇద్దరూ మాట్లాడుకోరు.

మరోవైపు హీరో బెస్ట్ ఫ్రెండ్, మరో ఆర్మీ అధికారిణి ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ ఆమె తండ్రి వీళ్లందరి కంటే హైయర్ ఆర్మీ ఆఫీసర్. హీరో అంటే ఇష్టం కాబట్టి అతన్ని పెళ్లి చేసుకోమని కూతురికి ఆర్డర్ వేస్తాడు. అయితే ఆ అమ్మాయి తన తండ్రి మాటలను పట్టించుకోకుండా ఆయనకు దూరంగా ఉంటూ వస్తుంది. ఇటువైపు హీరో యుద్ధంలో పాల్గొంటూనే, డాక్టర్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు. ఆ యుద్ధంలో భాగంగా హీరోయిన్ ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం, అక్కడ విచిత్రమైన రోగాలు రావడం వంటివన్నీ జరుగుతాయి. మరి టెర్రరిస్టుల నుంచి హీరో డాక్టర్ ని ఎలా కాపాడాడు ? ఆర్మీ అధికారిణి చివరికి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుందా? హీరో హీరోయిన్ ఒకటయ్యారా లేదా? అని ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆన్సర్ కావాలంటే మొత్తం 16 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు