OTT Movie : ప్రస్తుతం దేశంలోనే అత్యంత టాలెంటెడ్ హీరోలలో ఫహాద్ ఫాజిల్ కూడా ఒకరన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ హీరో పేరు మార్మోగిపోతుంది. పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఫహాద్ పుష్ప మూవీలో బన్వర్ లాల్ షెకావత్ గా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయ్యాడు. మరోవైపు మలయాళ సినిమాలకు కూడా క్రేజీగా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఓ బెస్ట్ క్రైమ్ గురించి ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ టైటిల్ ఏంటి? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…
ప్రైమ్ వీడియోలో అందుబాటులో…
ఇప్పుడు చెప్పుకోబోయే మూవీలో ఏమంత విశేషం ఉందంటే ఆ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటిదాకా వచ్చిన థ్రిల్లర్ సస్పెన్స్ క్రేజీ సినిమాల టాప్ లిస్ట్ లో ఈ మూవీ కూడా కచ్చితంగా ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేటివ్ క్రేజీ స్టోరీ లైన్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ డేటింగ్ యాప్ లో ప్రేమ లాంటి స్టోరీ తోనే ఈ మూవీ తెరకెక్కింది. సినిమా చాలా వరకు వీడియో కాల్స్ తోనే నడుస్తుంది. ఇప్పుడున్న యువతకు మంచి సందేశం అందించే ఈ సినిమాకి ఫహాద్ ఫాజిల్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ మూవీ పేరు సి యు సూన్.
కథ విషయానికి వస్తే…
హీరో పేరు జిమ్మీ. సాధారణంగానే యూత్ అంతా అమ్మాయిల వేటలో పడ్డట్టుగానే ఈ హీరో కూడా తన లవర్ కోసం వెతుకుతాడు. అలా డేటింగ్ యాప్ లో అను అనే యువతితో పరిచయం పెంచుకుంటాడు. నెమ్మదిగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారుతుంది. కానీ వీళ్ళెప్పుడు కనీసం రియల్ టైం లో ఒక్కసారి కూడా చూసుకోరు. ఎప్పుడు వీడియో కాల్స్ లో మాత్రమే మాట్లాడతారు. కొన్నాళ్ల తర్వాత జిమ్మీ అను అనే ఆ అమ్మాయిని తన తల్లికి వీడియో కాల్స్ ద్వారానే పరిచయం చేస్తాడు. నిజానికి వీడియో కాల్ లో ఆమె ముఖం, తను చెప్పిందాని ప్రకారం పేరు తప్ప ఆమె గురించి ఎవరికీ ఒక్క ముక్క కూడా తెలీదు. దీంతో జిమ్మీ కజిన్ ను ఆమె గురించి తెలుసుకోవాలని చెప్తుంది జిమ్మీ తల్లి. ఎందుకంటే కెవిన్ సైబర్ సెక్యూరి స్పెషలిస్ట్ గా పని చేస్తూ ఉంటాడు. ఇక కొన్ని రోజుల తర్వాత అను ప్రాబ్లం అంటూ కాల్ చేయడంతో జిమ్మీ ఆమెను ఇంటికి తీసుకెళ్ళి అక్కడే ఉంచుకుంటాడు. కానీ నిజానికి యూఏఈ లో లివింగ్ రిలేషన్షిప్ అనేది అతిపెద్ద నేరం. అందుకే ఆమెను తన తండ్రికే అప్పగించాలని ప్లాన్ చేస్తారు. ఇదంతా తెలుసుకున్న అను చనిపోతున్నానని వీడియో మెసేజ్ సెండ్ చేసి కనిపించకుండా మాయమవుతుంది. దీంతో విషయం సీరియస్ అయ్యి జిమ్మీ మెడకు చుట్టుకుంటుంది. మరి ఈ సమస్య నుంచి జిమ్మీ ఎలా బయటపడగలిగాడు? అసలు అను అనే అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అనే విషయాలు తెలియాలంటే సి యు సూన్ చూడాల్సిందే.