OTT Movie : ప్రస్తుతం ఓటీటిలో మలయాళ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండడంతో అన్ని భాషల ప్రేక్షకులు మాలీవుడ్ సినిమాలకు దాదాపుగా అడిక్ట్ అవుతున్నారు. వేరే సినిమాల మాదిరిగా హీరోను ఎలివేట్ చేయడం లేదా కమర్షియల్ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయకుండా మలయాళ మూవీ మేకర్స్ కథపై కాన్సెంట్రేట్ చేయడంతో ఆ కాన్సెప్ట్ లకు ఫిదా అవుతున్నారు. ఇలా మలయాళ సినిమాలంటే చెవి కోసుకునే వారి కోసమే ఈరోజు మన మూవీ సజెషన్. అయితే ఈ మూవీ ఒక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. మరి ఈ క్రేజీ హారర్ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహాలో స్ట్రీమింగ్…
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు భార్గవి నిలయం. ఇందులో టోవినో థామస్ హీరోగా నటించగా, మలయాళంలో ఈ సినిమాను నీలవెలిచం అనే టైటిల్ తో రూపొందించారు. ఇప్పుడు తెలుగులో భార్గవి నిలయం అనే పేరుతో ఆహాలో టాలీవుడ్ మూవీ లవర్స్ కోసం రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ 2023 ఏప్రిల్ 20న రిలీజై భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఆశిక్ అబూ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో రిమా కలింగల్, షైన్ టామ్ చాకో కూడా కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ మూవీని సెప్టెంబర్ 5 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే సెప్టెంబర్ 4 అర్ధరాత్రి నుంచి ఈ మూవీ భయపెట్టెందుకు రెడీ అయ్యింది.
స్టోరీ ఏంటంటే….
నవల రాయడానికి భార్గవి నిలయాన్ని అద్దెకు తీసుకున్న రచయితగా టొవినో థామస్ ఈ సినిమాలో నటించాడు. అతను భార్గవి (రిమా కల్లింగల్) అనే యువతి, కుమార్ (రోషన్ మాథ్యూ)తో ఆమె ప్రేమకథ, ఆమె అకాల మరణం, ఆమె ఆత్మగా మారి ఆ భవనాన్ని ఎలా వెంటాడుతుంది అనే కథను వింటాడు. రచయిత కాబట్టి ఆ స్టోరీని రాయాలి అనుకుంటాడు. అందుకే అక్కడికే వెళ్ళి స్టే చేయడమే కాకుండా స్థానికుల నుండి సమాచారాన్ని సేకరించి కథ రాయడం ప్రారంభిస్తాడు. మరోవైపు రచయిత ఒంటరితనం, తన జీవితంలో జరిగిన హార్ట్ బ్రేకింగ్ వంటి విషయాలతో ఎమోషనల్ గా ఎఫెక్ట్ అయ్యి ఉంటాడు. భార్గవి ప్రేమకథ రాయడం తనకు ఒకరకమైన రిలీఫ్ గా భావిస్తాడు. మరి ఇంతకీ భార్గవి, కుమార్ లవ్ స్టోరీ ఏంటి? ఇద్దరూ నిజంగానే ఆత్మహత్య చేసుకుని చనిపోయారా ? లేదా ఎవరైనా వారిద్దరినీ చంపేశారా? ఆమె ఆ భవనాన్ని ఎందుకు వెంటాడుతుంది ? హీరోను ఆ ఆత్మ ఏం చేసింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ భార్గవి నిలయం మూవీని చూడండి. ప్రఖ్యాత రచయిత వైకోమ్ ముహమ్మద్ బషీర్ స్క్రీన్ ప్లే ఆధారంగా 1964లో వచ్చిన రొమాంటిక్-హారర్ మూవీకి ఈ నీలవెలిచం రీమేక్. అయితే సాధారణ హారర్ మూవీస్ వంటి ట్విస్టటులు ఎక్స్పెక్ట్ చేసి సినిమాను చూస్తే నిరాశ తప్పదు.