OTT Horror Movie : హడలెత్తించే అడల్ట్ హార్రర్ మూవీ… ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు

OTT Horror Movie : హారర్ సినిమాలు అనగానే ఎంతసేపూ ప్రేక్షకులను ఎలా భయపెట్టాలి అనే అంశంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు డైరెక్టర్స్. కానీ హర్రర్ తో పాటు అడల్ట్ అంశాలు కూడా కలిపితే ఎలా ఉంటుంది ? అని ఆలోచించాడు ఈ మూవీ డైరెక్టర్. ఈరోజు మన మూవీ సజెషన్లో ఈ రెండు అంశాలు కలగలిపితే ఎలా ఉంటుందో తెలిపే మూవీ గురించి తెలుసుకోబోతున్నాం. సాధారణంగానే దయ్యాలు, భూతాలు, పిశాచాలు వంటి కాన్సెప్ట్ లపై ఎన్ని సినిమాలు తెరకెక్కినా కూడా హారర్ మూవీ లవర్స్ ని ఆకట్టుకోకుండా వదిలి పెట్టదు. కానీ ఇప్పుడు హారర్ తో పాటు బోల్డ్ కంటెంట్ ను కూడా కలిపి తెరకెక్కించిన ఈ హర్రర్ మూవీ జనాలను థియేటర్లలో హడలెత్తించింది. మరి ఈ కొత్త కాన్సెప్ట్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? సినిమా పేరేంటి అనే విషయాలపై ఒక లుక్కేద్దాం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ది ఎక్సార్సిజం ఆఫ్ గాడ్. ఈ సినిమాను చూశాక దెయ్యం సినిమా అంటే ఇదిరా మామ అనకుండా ఉండలేరు. బోల్డ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో కాకుండా సింగిల్ గా ఉన్నప్పుడే చూడాలని గుర్తు పెట్టుకోండి.

THE EXORCISM OF GOD (2021) Explained In Hindi | Creepy Content Hindi -  YouTube

- Advertisement -

కథ ఏంటంటే…

ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయితో ఫాదర్ లవ్ లో పడతాడు. నిజానికి ఆ అమ్మాయికి దెయ్యం పట్టిందని, దాన్ని వదిలించమని ఆమె కుటుంబ సభ్యులు ఫాదర్ ను అక్కడికి పిలిపిస్తారు. పైగా ఆమెను ఉంచిన రూమ్ లో సీసీ కెమెరాలు కూడా అమరుస్తారు.. అయితే ఫాదర్ ఆ దయ్యాన్ని వదిలించే క్రమంలో ఆమెతో ప్రేమలో పడతాడు. ఈ విషయాన్ని దయ్యం ఈజీగానే పసిగట్టేస్తుంది. ఇక దెయ్యాన్ని వదిలించేసాక ఆ అమ్మాయి అతన్ని ముద్దు పెట్టుకోవడం, శారీరకంగా కలవడం వంటివి జరిగిపోతాయి. నెక్స్ట్ సీన్ 18 సంవత్సరాల తర్వాత ఉంటుంది. జైల్లో ఉన్న ఖైదీలందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటారు. కానీ ఒక ఖైదీ మాత్రం తనకు ఫుడ్ ఇచ్చిన గార్డ్ చేయి కొరికేస్తుంది.

ఇదిలా ఉంటే మరోవైపు ఆ అమ్మాయి విషయంలో చేసిన తప్పుకు బాధపడే ఫాదర్ సీనియర్ ఫాదర్ దగ్గరికి వెళ్లి తప్పును ఒప్పుకుని తన బాధను వెళ్ళగకుతాడు. ఇక ఓ రోజు రాత్రి ఫాదర్ కు జైల్లో ఖైదీల పరిస్థితి బాలేదని కాల్ వస్తుంది. అయితే అక్కడ ఓ అమ్మాయి అచ్చం సినిమా మొదట్లో మరో అమ్మాయి ప్రవర్తించినట్టుగానే చేస్తుంది. ఆమెను చూసి టెన్షన్ పడిన ఫాదర్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా మొదట్లో ఫాదర్ ఇష్టపడిన అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి తమ కూతురే అని చెప్పడంతో ఫాదర్ ఎలాగైనా ఆ పాపని రక్షించాలని డిసైడ్ అయి, ఇంకో ఫాదర్ హెల్ప్ తీసుకుంటాడు. మరి ఆ దయ్యం తల్లి శరీరంలోకి వెళ్లినట్టుగానే పిల్ల శరీరాన్ని కూడా ఎలా ఆవహించింది? ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారా? చివరికి ఏం జరిగింది అనే విషయం తెలియాలంటే ఈ మూవీపై ఓ లుక్ చేయాల్సిందే

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు