OTT : ఓటీటీలు డబ్బు ఎలా సంపాదిస్తాయో తెలుసా? నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో వంటి ప్లాట్‌ఫామ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతగా డిమాండ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇంతకీ ఈ ఓటీటీలకు డబ్బులు ఎలా వస్తాయి? వీటి వల్ల సినిమాలకు ఏంటి లాభం ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దీన్ని OTT అని ఎందుకు అంటారు?
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు చాలా కాలం క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. అందువల్ల చిత్రాలను విడుదల చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అవసరం అయ్యాయి. అప్పుడే ఎంట్రీ ఇచ్చాయి ఓటీటీలు. అప్పటికే ఇవి అందుబాటులో ఉన్నప్పటికీ కరోనా టైమ్ లోనే భారీగా ఆదరణ పెరిగింది. ఒక సినిమా నేరుగా OTTలో విడుదలైతే దాదాపు 80 శాతం ఓటీటీ హక్కుల ద్వారా, 20 శాతం లాభం శాటిలైట్ హక్కుల ద్వారా మేకర్స్ కు వస్తుంది. వాస్తవానికి OTT అంటే ఓవర్-ది-టాప్. షార్ట్ కట్ లో ఓటీటీ అని పిలుస్తున్నాము. ఇంటర్నెట్‌లో టీవీ కంటెంట్‌ను చూసే సదుపాయం అందుబాటులోకి వచ్చినప్పుడు అంటే కేబుల్ బాక్స్‌ను వదిలించుకుని, మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో అన్ని టీవీ ప్రోగ్రామ్‌లను చూడగలిగే అవకాశం కల్పించే ప్లాట్‌ఫామ్‌ను OTT అని పిలుస్తారు. టీవీతో పాటు OTT ప్లాట్‌ఫామ్‌లలో వెబ్ సిరీస్‌లు, కామెడీ ప్రోగ్రామ్‌లు, చిత్రాల స్ట్రీమింగ్ భారతదేశంలో బాగా ఎక్కువనే చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే టీవీలను చూసే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా తగ్గింది.
OTT నుండి సినిమాలు ఎలా సంపాదిస్తాయి?
OTT ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కోసం సినిమాల హక్కులను OTT కొనుగోలు చేయాలి. రైట్స్ రూపంలో నిర్మాతకు కొంత మొత్తం వస్తుంది. ఈ ఒప్పందం ఒకే చిత్రం విభిన్న భాషా వెర్షన్‌లకు భిన్నంగా ఉంటుంది అంటే ప్రతి వెర్షన్ హక్కులు విడివిడిగా డీల్ చేస్తారన్నమాట. మరోవైపు కొన్ని సినిమాలు OTT ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నిర్మించబడతాయి. అంటే OTT ప్లాట్‌ఫామ్ సినిమాను ప్రత్యేకంగా డీల్ చేస్తుంది. HBO ప్రత్యేకంగా తన ప్లాట్‌ఫామ్ కోసం సినిమాలను రూపొందించే వ్యాపారంలో ఉంది. ఈ డీల్‌లో జరిగేది ఏమిటంటే ప్లాట్‌ఫామ్ సినిమా నిర్మాతలకు ఫిక్స్‌డ్ మొత్తాన్ని ఇస్తుంది. నిర్మాతలు దాని కంటే తక్కువ మొత్తంలో సినిమా చేస్తారు, అంటే మిగిలిన మొత్తం వారి లాభం.
OTT ఎలా లాభం పొందుతుంది?
సినిమా నిర్మాతలు ఈ విధంగా లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే OTT ప్లాట్‌ఫామ్‌లు వారికి డబ్బు ఇస్తున్నాయి కాబట్టి ఎలా చూసుకున్నా మేకర్స్ కు లాభమే. మరి ఈ ప్లాట్‌ఫారమ్‌లు ఎలా లాభాలు పొందుతాయి? అంటే ఈ వ్యాపారంలో మూడు రకాల పద్ధతులు ఉన్నాయి.
TVOD – ప్రతి సబ్స్క్రయిబర్ అంటే OTT ఏదైనా కంటెంట్‌ని డౌన్‌లోడ్ చేసినప్పుడు రుసుము చెల్లిస్తారు. అంటే ప్రతి డౌన్‌లోడ్‌లో లావాదేవీ.
SVOD – అంటే ఏ సబ్స్క్రయిబర్ అయినా ప్రతి నెలా లేదా ఏడాది, 6 నెలల కోసం కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. అలా వారు ఆ ప్లాట్‌ఫారమ్‌లోని మొత్తం కంటెంట్‌ను చూడగలరు.
AVOD అనేది మూడవ పద్ధతి. కంటెంట్‌ను చూడటానికి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పనిలేదు. కానీ సబ్స్క్రయిబర్ కంటెంట్ మధ్య యాడ్స్ ను చూడాలి. యూట్యూబ్ లాగే ఉచితం.. అయితే వీడియోల మధ్య యాడ్స్ చూడాలి. ఈ ప్రకటనల ద్వారా OTT డబ్బు సంపాదిస్తుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ముందుగా ప్లాట్‌ఫామ్ దాని కంటెంట్‌ను రూపొందించడానికి లేదా కొనుగోలు చేయడానికి డబ్బును ఖర్చు చేస్తుంది. ఆ కంటెంట్ వీక్షకులు లేదా వినియోగదారుల నుండి సబ్స్క్రిప్షన్ పేమెంట్ వసూలు చేయడం ద్వారా అమ్ముతుంది.