OTT Bold Movie : అందరూ చూస్తుండగానే స్వామీజీతో ఆ పని చేసిన శాలిని పాండే… ఆశ్రమ్ ను మించిన సిరీస్

OTT Bold Movie : కొంతమంది స్వామీజీలు జనాల మూఢనమ్మకాలను అడ్డుపెట్టుకుని వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారు అనే విషయం ఇప్పటికే ఎన్నోసార్లు బయటకు వచ్చింది. పైగా పలువురు స్వామీజీలు జైలు పాలు కూడా అయ్యారు. కానీ జనాలు మాత్రం ఇంకా మారడం లేదు. మూఢనమ్మకాలతో దేవుడి దూతగా భావించే స్వామీజీలు ఏం చెప్పినా సరే చేయడానికి రెడీగా ఉంటారు. అది భక్తితో సేవ చేయడమైనా, స్వామిజికి శారీరకంగా తమను తాము అర్పించుకోవడం అయినా సరే వెనకాడరు. ఇప్పటికే ఇలాంటి జానర్ లో వచ్చిన ఆశ్రమ్ అనే వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఆల్మోస్ట్ ఇలాంటి కథతోనే కాకపోతే బయోపిక్ తో మరో మూవీ రిలీజ్ అయింది. ఇక ఈ మూవీలో శాలిని పండే నటించడం మరో ఇంట్రెస్టింగ్ విషయం. మరి ఆశ్రమ్ ను మించిపోయే స్టోరీతో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? స్టోరీ ఏంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తనయుడి డెబ్యు మూవీ మహారాజ్. జునైద్ ఖాన్ హీరోగా నటించిన మూవీ మహరాజ్. స్టోరీ మొత్తం జునైద్ ఖాన్, జైదీప్ ఆహ్లావత్ నా చుట్టూనే తిరుగుతుంది. ఈ మూవీ థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీడీలోనే రిలీజ్ అయింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో మహారాజ్ స్ట్రీమింగ్ అవుతోంది.

Maharaj review: Junaid Khan's debut has powerful storytelling but lacks impact; Jaideep Ahlawat is terrific | Bollywood - Hindustan Times

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

హీరో పేరు కర్సన్ దాస్. అతను వార్తా పత్రికలకు న్యూస్ రాస్తూ ఉంటాడు. స్టోరీ మొత్తం 1862లో నడుస్తుంది. అప్పట్లో బొంబాయిలో మహారాజ్ జేజే చెప్పిందే శాసనం అన్నట్టుగా ఉంటుంది. అక్కడ ఉండే అందరూ జేజేను శ్రీకృష్ణుని రూపుమని భావించి, అతనుండే ప్రాంతాన్ని దేవాలయం అని కొలుస్తారు. అతని కోసం ఏం చేయడానికి కూడా వెనకాడరు. అయితే ఈ పరిస్థితిని జెజె తనకు అనుకూలంగా మార్చుకుని ఆడవారిని లొంగ తీసుకుంటాడు. ఈ క్రమంలోనే హీరో కర్సన్ దాస్ భార్య కిషోర్ అని కూడా జేజే సేవకు పిలుస్తారు. పైగా వీళ్ళిద్దరి శృంగారాని డబ్బులు ఇచ్చి చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. అయితే ఈ విషయం తెలిసిన హీరో అక్కడికి వెళ్లి తన భార్యను హెచ్చరిస్తాడు. కానీ ఆమె వినదు. కానీ చివరకు అతడు తన చెల్లిని కూడా అదే సేవ చేయమని కోరడంతో జేజే గురించి అసలు నిజం హీరోయిన్ కి తెలిసిపోతుంది. దీంతో కిషోరి ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా జేజే నిజస్వరూపాన్ని జనాలకు తెలియజేయాలని ఓ లేఖను రాసి పెడుతుంది. ఇదే క్రమంలో లీలావతి అనే అమ్మాయి జేజే సేవ వల్ల గర్భవతి అవుతుంది. ఆమెకు అబార్షన్ చేయించడంతో ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఈ నేపథ్యంలోనే హీరో వీళ్ళందరిని కాపాడడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. మరి ఇంతకీ జేజే మోసాన్ని హీరో జనాలకు ఎలా తెలియచెప్పాడు ? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీని తెరపై చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు