Maruthinagar Subramanyam OTT : విలక్షణ నటుడు రావు రమేష్ (Rao Ramesh) ప్రధాన పాత్రలో నటించిన సినిమా “మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం”. లక్ష్మణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించడం జరిగింది. రెండు వారాల కింద థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకోగా, థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేదు. రావు రమేష్ తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినా, కంటెంట్ డీసెంట్ గా ఉన్నా, థియేటర్లలో ఉన్న మిగతా సినిమాల పోటీ వల్లో, లేక మరే కారణమో తెలీదు గాని, మారుతీ నగర్ సినిమా ఆశించినంతగా ఆడలేదు. పైగా ఈ సినిమాకు రామ్ చరణ్, చిరంజీవి లాంటి స్టార్స్ నెట్టింట ప్రమోట్ చేయగా, అల్లు అర్జున్ (Allu arjun) ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ప్రమోట్ చేసాడు. అయినా ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేదు.
ఓటిటి రిలీజ్ సిద్ధమైన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం..
అయితే థియేటర్లో అంతగా ఆడలేకపోయిన “మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం” (MaruthiNagar Subrahmanyam) ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయింది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలోంచి తొలగి పోగా ఓటిటి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయింది. కాగా మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ఓటిటి రిలీజ్ అప్డేట్ ని ఇచ్చారు మేకర్స్. ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వారు దక్కించుకున్నారు. కాగా ఈ నెల సెప్టెంబర్ 20 నుండి ఆహా (Aha OTT) ఓటిటి ప్రైమ్ వీడియోలో మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు.
ఓటిటి లో అయినా మెప్పిస్తుందా?
ఇక థియేటర్లలో ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం (Maruthinagar Subramanyam OTT) ఓటిటి రిలీజ్ కోసం కూడా ప్రేక్షకులు పెద్దగా ఎదురుచూడడం లేదు. కానీ కంటెంట్ బాగుంటే ఓటిటి లో అయినా మంచి రెస్పాన్స్ తెచ్చుకొనే ఛాన్స్ ఉంది. ఇక లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పకులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. పిబిఆర్ సినిమాస్ మరియు లోకమాత్రే క్రియేషన్స్ బ్యానర్లపై బుజ్జి రాయుడు పెంట్యాల మరియు మోహన్ కార్యా నిర్మించిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం డిజిటల్ ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.