Keerthi suresh : మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గతంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు, మహా నటి సినిమా ఒక ఎత్తు. ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో కి కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ కూడా ఆమె చేస్తుంటారు.. రీసెంట్ గా రఘు తాత అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల అవ్వబోతుంది. ఏ ఓటీటీలో విడుదల అవుతుందో ఇప్పుడు చూద్దాం..
కీర్తీ సురేష్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆగష్టు 15న తమిళ్ వర్షన్ విడుదల అయింది. రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. హిందీ భాషకు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం కోలివుడ్ ప్రేక్షకులను మెప్పించింది. కాగా, రఘు తాత మూవీ ఓటీటీ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ స్ట్రీమింగ్ హక్కులను జీ5 భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది..
అయితే సెప్టెంబర్ మొదటి వారం లేదా సెప్టెంబర్ 14న ఓటీటీలో తెలుగు వర్షన్ డైరెక్ట్‌గా విడుదల అవుతుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వార్త షికారు చేస్తుంది. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలను ఖండిస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైయినర్‌గా ఈ సినిమా రాబోతుంది. హిందికి వ్యతిరేకంగా పోరాడే ఈమె సడెన్ గా ఎందుకు తన నిర్ణయం మార్చుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది. ఇంకా చెప్పాలంటే మొదటి నుంచి హిందీ వ్యతిరేకిగా ఉన్న ఆమె సడెన్ గా ఎందుకు హిందీ ఎగ్జామ్ రాయాలనుకుంది అనేది ఈ సినిమా స్టోరీ.. ఈ మూవీ ఇక్కడ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..