Demonte Colony 2.. ఇటీవల కాలంలో ఒక సినిమా మంచి హిట్ అయిందంటే, ఆ సినిమాకు సీక్వెల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే మొదటి సినిమా హిట్ అయితే సీక్వెల్ హిట్ అవుతుందన్న నమ్మకం లేదు. చాలా వరకు సీక్వెల్స్ ఫ్లాప్ గా నిలిచాయి కానీ ఇక్కడ కొన్ని హార్రర్, హిస్టారికల్ చిత్రాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే డిమోంటి కాలనీ కూడా ఒకటి. 2015లో విడుదలైన తమిళ్ భాషా హార్రర్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాకి అజయ్ జ్ఞానమూర్తి దర్శకత్వం వహించారు.
డిమోంటి కాలనీ 2..
ఈ చిత్రంలో అరుళ్ నితి నటించగా, సనంత్ , రమేష్ తిలక్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ కూడా నటించారు. చెన్నైలోని అల్వార్పేట్ లోని డిమోంటి కాలనీలో జరిగే కల్పిత కథ ఇది అన్నట్టు చూపించారు. 2015 మే 22న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా డిమోంటి కాలనీ 2 అంటూ అదే తారాగణంతో ఆగస్టు 15 2024న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేశారు. ఇక సీక్వెల్ కి కూడా విమర్శకుల నుంచి అలాగే ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రివ్యూస్ లభించాయి. స్క్రీన్ ప్లే, నటీనటుల ప్రదర్శన చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు.
ఓటీటీ రిలీజ్ డేట్ లాక్..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డేట్ కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏ సినిమా అయినా సరే థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తుంది. ఇప్పుడు అందులో భాగంగానే ఈ చిత్రం కూడా ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 20 నుంచి ఓటిటి వీక్షకులను అలరించడానికి రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ Zee 5 దక్కించుకోగా, ఆ రోజు నుంచి రానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ వారు రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాని ఒంటరిగా మాత్రం చూడకండి అనుక్షణం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమా ప్రేక్షకులను మరింత భయానికి గురిచేస్తుంది.
డిమోంటి కాలనీ 2 తారాగణం..
ఇక ఈ చిత్రంలో నటించిన నటీనటుల విషయానికి వస్తే అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుళ్ నితి, ప్రియా భవాని శంకర్ కీలక పాత్రలు పోషించారు. మరి వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం తెలుగులో కూడా డీసెంట్ వసూళ్ళు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక వీరితోపాటు అర్చన రవిచంద్రన్ , అరుణ్ పాండియన్, మీనాక్షి గోవింద రాజన్ , సర్జనో ఖలీద్ తదితరులు కీలకపాత్రను పోషించారు. ఇకపోతే 2022లో ఈ సినిమా సీక్వెల్ కి వెంకీ వేణుగోపాల్ ను దర్శకుడుగా ప్రకటించారు. కానీ నవంబర్లో కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో ఆ స్థానాన్ని జ్ఞానముత్తు తో భర్తీ చేశారు. ఇప్పటికీ కూడా ఆయన రచనా బృందంలో భాగమైనట్లు తెలుస్తోంది. 2023 జూన్ చివరి నాటికి ఈ సినిమా పూర్తి అయినా కొన్ని కారణాల వల్ల ఆగస్టు 15 విడుదలైంది.