The boys season 4: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసిన క్రేజీ సిరీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

The boys season 4: ప్రస్తుతం ఓటీటీల హడావిడి ఏ విధంగా పెరిగిపోయిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రెసెంట్ సినిమాల కంటే వెబ్ సిరీస్ ని ఎక్కువగా రూపొందిస్తున్నారు డైరెక్టర్స్. ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న పలు సెన్సేషనల్ హిట్ సిరీస్ లలో ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఒకటి.

ఈ యాప్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన సూపర్ హీరో జానర్ సిరీస్ ది బాయ్స్ మంచి ఆదరణ దక్కించుకుంది. ఆంటోనీ స్టార్, ఎరిన్ మోరియార్టీ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఇప్పటివరకు మొత్తం మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ సిరీస్ నాల్గవ సీజన్ కూడా స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది. అయితే ప్రైమ్ వీడియో వారు ఫైనల్ గా సీజన్ 4 నీ ఈ జూన్ 13 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.

Crazy series coming to digital streaming
Crazy series coming to digital streaming

ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ మొత్తం 30 భాషలకి పైగా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మన దేశంలో స్ట్రీమింగ్ కి వచ్చింది ఈ సిరీస్. మన దేశంలో ఈ సిరీస్ మొత్తం పాన్ ఇండియా భాషలు ఐదు సహా ఇతర ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కానీ ఇక్కడ అనుకున్నట్టుగానే మొత్తం సిరీస్ ఎపిసోడ్స్ ని రిలీజ్ చేయలేదు. కేవలం మూడు ఎపిసోడ్స్ ని మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేయగా మిగతా ఎపిసోడ్ ఒక్కొక్కటిగా ఒక్కో వారం అందుబాటులోకి తీసుకురానున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు