Committee Kurrollu: ప్రస్తుతం వచ్చిన సినిమాల్లో కొంతమేరకు మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన సినిమా కమిటీ కుర్రాళ్ళు. ఈ సినిమాతో చాలామంది యూట్యూబర్స్ వెండి తెరపై ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాను మెగా ప్రిన్సెస్ నిహారిక నిర్మించారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు టీజర్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడుగా మారాడు. యాదు వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలోని విలేజ్ బ్యాక్ డ్రాప్ పాలిటిక్స్ ను చూపించారు. ఈ సినిమాలో కొంతమంది కుర్రోళ్ళు తమ బాల్య జీవితాన్ని ఎలా గడిపారు అని అనేక అంశాలను చూపించి మంచి నోస్ట్రాలజీ ఫీల్ క్రియేట్ చేశారు. ఈ సినిమా 90 కిడ్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఒక విలేజ్ లో అందరూ బాగా కలిసి ఉండి బాగా మాట్లాడుకునే స్నేహితులు ఒక చిన్న గొడవ వలన ఎలా విడిపోయారు. మళ్లీ వారంతా ఎలా కలిశారు.? ఈ సినిమాలో రాజకీయ అంశాలు ఏంటి అని చూపించాడు దర్శకుడు.
ఆగస్టు 9న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న వచ్చిన కొన్ని సినిమాల వలన కొన్నిచోట్ల కనుమరుగయిపోయింది. చూడాలనుకున్న చాలామంది ఈ సినిమాను చూడలేకపోయారు వారందరికీ కూడా ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం రానుంది. ఈ సినిమా ఆహా లో త్వరలో స్ట్రీమింగ్ కి రానుంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి లాభాలను మూటగట్టుకుని ఈ సినిమా ఇక ఓటిటిలో ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటుందో తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చూడక తప్పదు.