Balakrishna – Chiranjeevi : నందమూరి బాలయ్య బిగ్ స్క్రీన్ మీదే కాదు.. స్మాల్ స్క్రీన్ పై కూడా దుమ్ము దులిపేస్తాడు. ఇది మేము చెబుతున్న మాట కాదు. నందమూరి ఫ్యాన్స్ చెబుతున్న ఫ్యాన్స్. బాలయ్య చేసిన షో అన్ స్టాపబుల్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ షోలో బాలయ్య పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంది. ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ లాగా కనిపించే ఆయన మరో యాంగిల్ ను చూపించాడు. ఆ షోకు టీఆర్పీ రేటింగ్ మాములుగా లేదు. దాంతో ఈ షో నాలుగు సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో వార్త చక్కర్లు కొడుతుంది. ఈ షో సీజన్ 4 కు గెస్టు గా చిరంజీవి రాబోతున్నాడని సమాచారం.. అంతేకాదు నాగార్జున కూడా రాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
వ్యవహరించిన బుల్లితెర కార్యక్రమం ‘అన్ స్టాపబుల్’ కొత్త సీజన్ మొదలుకానుంది. గతంలో అతిథుల కొరతతో ఆపేసిన ఈ కార్యక్రమాన్ని ఆహా సంస్థ మళ్లీ ప్రారంభించబోతుంది. “అన్ స్టాపబుల్” కొత్త సీజన్‌కు ముహుర్తం ఖరారు చేశారు మేకర్స్. ఈ ఏడాది విజయ దశమి నుంచి కొత్త సీజన్‌ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది. ఈ సారి పాన్ ఇండియా స్థాయిలో సోలో ఇంటర్వ్యూలతో పాటు మరికొన్ని డబుల్ ధమాకా జోడిలతో కూడా ముఖాముఖిలను సెట్ చేస్తున్నారు. ఈ షో లో ఈ సారి వచ్చే సెలెబ్రేటిల గురించి కాస్త జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్.. అందుకే ముందుగా సీనియర్స్ ను రంగంలోకి దించబోతున్నారని ఇప్పటికే మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..
బాలయ్యతో చిరంజీవి..
గతంలో ఈ షోకు పొలిటిషియన్స్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్స్ తో పాటుగా చాలా మంది పాల్గొన్నారు. అందరికన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఎపిసోడ్స్ ఓ రేంజులో హైప్ ను క్రియేట్ చేశాయి. బాలయ్య ఛలోక్తులు మాములుగా పేలలేదు. ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా అంతకు మించి క్రేజ్ ను తీసుకొచ్చేందుకు, మేకర్స్, బాలయ్య ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని గెస్టుగా తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో నందమూరి, మెగాస్టార్ ఫ్యాన్స్ ఎప్పుడు వీరిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూస్తామా అని ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన రాబోతుందని సమాచారం.
అన్ స్టాపబుల్ షోలో నాగార్జున..
బుల్లితెరపై వస్తున్న షోలలో సినిమాలను ప్రమోట్ చెయ్యడం కామన్.. ఈ షోలో కూడా గతంలో చాలా సినిమాలను ప్రమోట్ చేశారు. ఇప్పుడు ప్రారంభం కాబోతున్న షోలో కుబేర టీమ్ సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది. నాగార్జున, ధనుష్, డైరెక్టర్ రాబోతున్నట్లు టాక్. దీనిపై మేకర్స్ ఎలాంటి అనౌన్స్ మెంట్ చెయ్యలేదు కానీ త్వరలోనే అప్డేట్ రాబోతుందని టాక్..