OTT Movies : ప్రతి వారం థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలు జనాలను మెప్పిస్తున్నాయి. అయితే అక్కడ హిట్ అయినా లేకున్నా కూడా ఓటిటీలో మాత్రం విడుదల అవుతున్న ప్రతి సినిమా హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉన్నాయి. థియేటర్లలో కూడా మంచి క్రేజ్ ఉన్న సినిమాలే విడుదల అవుతున్నాయి.ఈ వారం థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించడానికి రామ్ డబుల్ ఇస్మార్ట్ , రవి తేజ మిస్టర్ బచ్చన్ లాంటి డీసెంట్ హైప్ ఉన్న సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. ప్రతి వారం లానే ఈ వారం కూడా కొన్ని స్పెషల్ సినిమాలు ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. అందులో డార్లింగ్‌తో పాటు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ ప్రధానపాత్రల్లో నటించిన మనోరతంగల్ స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ రెండు చిత్రాలు మాత్రమే కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒక లుక్ వేద్దాం..
డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
స్టార్ వార్స్ : యంగ్ జెడి అడ్వెంచర్స్ సీజర్ 2- ఆగష్టు 14
డార్లింగ్ – ఆగష్టు 13
మై పర్ఫెక్ట్ హస్బెండ్ – ఆగష్టు 16
జియో సినిమా..
ఇండస్ట్రీ సీజన్-3 – ఆగష్టు 12
శేఖర్ హోమ్ – ఆగష్టు 14
బెల్ ఎయిర్ సీజన్ 2 – ఆగష్టు 15
అమెజాన్ ప్రైమ్..
మనమే – ఆగష్టు 16
నెట్ ఫ్లిక్స్..
మాట్ రిఫె : లూసిడ్ – ఏ క్రౌడ్ వార్ స్పెషల్ – ఆగష్టు 13
డాటర్స్ (డాక్యుమెంటరీ) – ఆగష్టు 14
రెన్ ఫీల్డ్ ( హాలీవుడ్) – ఆగష్టు 14
వరస్ట్ ఎక్స్ ఎవర్ – ఆగష్టు 15
యావరేజ్ జో సీజన్ 1- ఆగష్టు 15
బ్యాక్ యార్డ్ వైల్డర్ నెస్ – ఆగష్టు 15
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4- పార్ట్1 – ఆగష్టు 15
కెంగన్ అసుర సీజన్ 2- పార్ట్ 2 – ఆగష్టు 16
పెరల్ – ఆగష్టు 16
షాజమ్ – ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ – ఆగష్టు 17
ది గార్ ఫీల్డ్ మూవీ ( యానిమేషన్ మూవీ) – ఆగష్టు 17
ఐ కెన్ నాట్ లైవ్ వితౌట్ యూ – ఆగష్టు 16
ఈటీవీ విన్..
వీరాంజనేయులు విహార యాత్ర – ఆగష్టు 14
హొయ్ చోయ్..
పరిణీత – ఆగష్టు 15
సోనీలివ్..
చమక్: ది కంక్లూజన్(హిందీ సినిమా) – ఆగస్టు 16
మొత్తంగా చూసుకుంటే ఈ వారం ఏకంగా 22 సినిమాలు విడుదల కాబోతున్నాయి. సినీ లవర్స్ కు ఇది పండగే.. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను మీకు నచ్చిన ఓటీటీలో చూసేయ్యండి..